ప్రీ రిలీజ్ ఫంక్ష‌నా… సంతాప స‌భ‌నా

Read Time: 1 minutes

అస‌లే మ్యూజిక్ అంతంత‌గా ఉన్న అర‌వింద స‌మేత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎంతో చ‌ప్ప‌గా సాగింద‌న్న టాక్ బ‌లంగా విన‌ప‌డుతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్డీఆర్, నంద‌మూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సినిమా మొద‌ట్లోనే త‌స్సుమ‌నిపించేలా ఉంద‌న్న‌ది ఫ్యాన్స్ ఫిలింగ్.

సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అంటే… చ‌ప్ప‌ట్లు, న‌వ్వులు, గ్లామ‌ర్, అరుపులు, కేక‌లు. అంతా ఇంతా హ‌డావిడి ఉండ‌దు. సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ల‌న్నీ ఇప్పుడు సినిమా స‌క్సెస్ మీట్స్ లా అయిపోయాయన్న విమ‌ర్శ‌లు వ‌చ్చే స‌మ‌యంలో… ఎన్డీయార్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది. కానీ ఆ రేంజ్ కన‌ప‌డ‌లేదు. అన్న‌ద‌మ్ముల ఏడుపులు, నిర్వ‌హ‌ణ లోపంతో… మొత్తం ఈవెంట్ చ‌ప్ప‌గా సాగింది. ఇటీవ‌లే హ‌రికృష్ణ మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో… ఉన్న విషాదం మొత్తం ఈ ఈవెంట్ లో స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. ఓవైపు ఎన్టీయార్, మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ ప‌దేప‌దే తండ్రిని గుర్తుచేసుకుంటూ… దుఃఖంలో మునిగిపోయారు. ఇక తండ్రికి చితిపెట్టే స‌న్నివేశం ఇంత‌వ‌ర‌కు ఏ చిత్రంలో లేద‌ని, కాని విధిలా ఈ చిత్రంలో ఉంద‌ని ఎడుస్తూ ఉండిపోయారు ఎన్టీఆర్.

ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే చెప్పేశాడు ఎన్టీఆర్. డాన్స్ లేదు, అది లేదుఅని అన‌కండి… నేను న‌టున్ని అంటూ, ఓవైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను వెన‌కేసూకొస్తూనే… రిలీజ్ త‌ర్వాత రివ్యూలు రాసే వారికి సూచ‌న‌లు చేసిన‌ట్లుగా ఎన్డీయార్ మాట‌లున్న‌ట్లు క‌న‌ప‌డింది.

విషాదంలో మునిగిపోయిన ఎన్డీయార్ కుటుంబానికి అర‌వింద‌స‌మేత సినిమా కొంతైనా… సేద‌తీరుస్తుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*