
కొంతకాలంగా… రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్న మంత్రి హరీష్ రావు, మళ్లీ ఫాంలోకి వచ్చాడా…? ఇన్నాళ్లు సిద్ధిపేటకే పరిమితమైన ఆయన, మళ్లీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టాడా….? ఇక రాష్ట్రం మొత్తం పర్యటించనున్నాడా…? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అందుకే, హరీష్ మహకూటమి పొత్తులపై కూటమి నేతలైన కోదండరాం, ఉత్తమ్ ను నిలదీస్తూ… లేఖాస్త్రాలు సందించారు.
హరీష్ లేకపోతే… జోడెడ్ల బండి కూలినట్లేనంటూ ఒకరిద్దరు సీనీయర్ నేతల సూచనలతో కేటీఆర్, కేసీఆర్ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అందుకే హరీష్ నే ముందుపెట్టి రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దిగితే… ఇతర పార్టీలో హరీష్ స్థానం గల్లంతుకావటంతో పాటు, ప్రస్తుతానికి తాము గట్టేక్కే అవకాశం ఉందని స్కేచ్ వేసినట్లు తెలుస్తోంది.
హఠాత్తుగా హరీష్ ప్రతిపక్షకూటమిని టార్గెట్ చేస్తూ… లేఖలు రాయటం అంటేనే అంతరార్ధం ఇదేనని, హరీష్ భుజాలపై తుపాకి పెట్టి కేటీఆర్, కేసీఆర్ లు కూటమిని దెబ్బతీసే పనికి అంకురార్పణ చేసారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ద్రోహులైన చంద్రబాబుతో కాంగ్రెస్ పోత్తును, కాంగ్రెస్ కు ఎన్నికల సమాగ్రిని అందించటంలో టీడీపీ పాత్రను, కోదండరాం… టీడీపీతో కలవటాన్ని ప్రధాన టార్గెట్ గా హరీష్ లేఖాస్త్రాన్ని సంధించారు. మీరు ఈ ప్రశ్నలు చెప్పి… మీ అసంబద్ధ కలయికకు సమాధానాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
Leave a Reply