ఒక్క‌టైన హ‌రీష్ రావు, కేటీఆర్. ఇదంతా నిజ‌మేనా…?

Read Time: 0 minutes

ఎన్నో రోజులుగా అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న టీఆర్ఎస్ కీల‌క నాయ‌కులు హ‌రీష్, కేటీఆర్ లు ఒక్క‌ట‌య్యారా… అంటే అవున‌నే ప్ర‌య‌త్నమ‌యితే చేస్తున్నారు. కొంత‌కాలంగా వీరిద్ద‌రి మ‌ద్య ఉన్న గ్యాప్, హ‌రీష్ ను పార్టీ నుండి వెళ్ల‌గొట్టేస్తారా అన్న వార్త‌ల నేప‌థ్యంలో… ఇరువురి క‌ల‌యిక ప్రాదాన్య‌త సంత‌రించుకుంది.

నీళ్ల‌మంత్రి హ‌రీష్ ఉండ‌టంతోనే ప్రాజెక్టులు ప‌రుగెడుతున్నాయ‌ని, ఇన్నాళ్లుగా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిప‌నిచేశామ‌ని… ఇక‌నుండి అలాగే ప‌నిచేస్తామ‌ని ఇద్ద‌రు క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం కార్య‌క‌ర్త‌ల ముందు చేశారు. కేటీఆర్ ను కూడా పొగిడిన హ‌రీష్… సిద్ధిపేట స్పూర్తితో భారీ మెజారిటీ వ‌చ్చేలా చూడాలని కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు.

ఒవైపు మ‌హ‌కూట‌మి ఎదుర్కొంటు, టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే… హ‌రీష్ లేకుండా సాద్యం కాద‌న్న రిపోర్ట్స్ తోనే మ‌ళ్లీ హ‌రీష్ తో కేటీఆర్ చేతులు క‌లిపాడ‌ని తెలుస్తోంది. కేవ‌లం సిద్ధిపేట‌కే హ‌రీష్ ను ప‌రిమితం చేసిన వీరు, ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. పైగా అభ్య‌ర్థులంతా హ‌రీష్ వైపు ప్ర‌చారం కోసం చూస్తుండ‌టం, రోజురోజుకు మ‌హ‌కూట‌మి బ‌లం పెరుగుతుండ‌టంతో… త‌ప్ప‌క క‌ల‌వ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాల స‌మాచారం. దీంతో సిరిసిల్ల నేత‌ల‌తో జ‌రిగే మీటింగ్ కు హ‌రీష్ ను ఆహ్వ‌నించ‌టం ద్వారా… ఇద్ద‌రం ఒక్క‌టే అని చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా క‌న‌ప‌డుతోంది. ఒక‌రిని ఒక‌రు పొగడ‌టం, ప్ర‌శంస‌లు కురింపించుకోవ‌టం అందులో భాగ‌మే. అయితే, ఇప్ప‌టికిప్పుడు అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పోయే ఆస్కార‌మ‌యితే క‌న‌ప‌డ‌టం లేదు. రోజుకో ట‌ర్న్ తీసుకుంటున్న బావ‌, బామ్మ‌ర్దుల ఆదిపత్య పోరు మ‌రో రూపంలో బ‌య‌టికి వ‌చ్చే ప్ర‌మాదం క‌న‌ప‌డుతోంది.

అయితే, కేసీఆర్ ప్ర‌త్యేక చొర‌వ‌తోనే ఇప్ప‌టిక‌యితే ఈవివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్లు తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*