కేసీఆర్ కు ముందు నుయ్యి, వెన‌క గొయ్యిలా త‌యారైన హుజుర్ న‌గ‌ర్ సీటు కేటాయింపు

Read Time: 0 minutes

తెలంగాణ ముందస్తు ఎన్నికలతో హుజూర్ నగర్ నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి.  టీఆర్ఎస్ పార్టీ 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే అందులో హుజూర్ నగర్ సీటును గులాబీబాస్ ఎవరికి కేటాయించ‌కుండా ప‌క్క‌న పెట్టేశారు.  2014 ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను పోటీకి దించారు. అయితే ఈసారి మాత్రం ఆ టికెట్ శంకరమ్మకు కాకుండా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు సైదిరెడ్డికి ఇచ్చేందుకు పార్టీ ఆలోచనలు చేస్తుంది.

గులాబీ ప్లాన్ తెలుసుకున్న శంకరమ్మ ఎదురుదాడికి దిగారు. హుజూర్ నగర్ టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్నిరోజుల క్రితమే టికెట్ విషయమై మంత్రి జగదీష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. మంత్రియే తనకు టికెట్ దక్కుండా అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టికెట్ దక్కకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. అయినా పార్టీ నుండి గానీ, అధినేత నుండి గానీ ఇంత‌వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోగా… త‌న‌ను పిలిచికూడా ఇంత‌వ‌ర‌కు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌లేదు. దీంతో శంక‌ర‌మ్మ మ‌రోసారి బ‌హిరంగంగానే వాఖ్య‌లు చేస్తూ…. త‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేక‌పోతే, ఎన్నారై అప్పిరెడ్డి కి టికెట్ ఇవ్వాలంటూ సూచ‌న‌లు చేశారు.

కానీ, ఎట్టి పరిస్థితుల్లో… ఎన్నారైనని చెప్పుకుంటున్న సైదిరెడ్డికి మాత్రం టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ అతనికి టికెట్ ఇచ్చినా హుజూర్ నగర్ నుంచి తరిమికొడతామని విమర్శించారు. సైదిరెడ్డికి డబ్బులు బాగా ఉండటంతోనే ఆయనకు టికెట్ కట్టబెట్టేందుకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని శంకరమ్మ దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి తిగిన శ్రీకాంతచారి తల్లిపై టికెట్ కోసం పోటీకి దిగడానికి సైదిరెడ్డికి సిగ్గులేదంటూ విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో  ఉత్తమ్ కుమార్‌పై పోటీకి దిగిన శంకరమ్మ ఓటమి పాలయ్యారు. మరి ఈసారి గులాబీ బాస్ ఈ సమస్యకు ఎలా చెక్ పెడతారో ? ఎవరికి టికెట్ కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*