జ‌గ‌న్ పై చంద్ర‌బాబు టీం స్కెచ్ బ్యాక్ ఫైర్

Read Time: 1 minutes

ఏపీలో చంద్ర‌బాబు, జ‌గ‌న్ లు నువ్వా-నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డుతుంటారు. గ‌తంలో త‌మిళ‌నాడులో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల విద్వేశ రాజ‌కీయాలు ఇప్పుడు ఏపీలో క‌న‌ప‌డుతాయి. అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌చారంలో… రెండు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోగా, రెండోది చంద్ర‌బాబు టీం ప్లాన్డ్ గా స్కేచ్ వేసినా బ్యాక్ ఫైర్ అయింది.

జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఓరోజు జ‌గ‌న్ రోడ్ షోలో మాట్లాడుతుండ‌గా… గ‌ర్బీణీతో ఉన్న ఆటో ఆ జ‌న స‌మూహాం నుండి వ‌చ్చింది. దీంతో జ‌గ‌న్ త‌న స్పీచ్ ను కాస్సేపు ఆపి, తానే స్వ‌యంగా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌కు జ‌ర‌గండంటూ… ఆటోకు దారిచ్చేలా చేశారు. మ‌న ప్ర‌బుత్వం వ‌స్తే… ఇలాంటి బాధ‌లు ఉండ‌కుండా, వైఎస్ పెట్టిన 108మ‌ళ్లీ వ‌స్తుంది కూయ్.. కూయ్… కూయ్ అంటూ వైఎస్ స్టైల్లో చెప్ప‌టంతో జ‌నాల్లోకి బాగా వెళ్లింది. వైరల్ అయింది.

దీనికి విరుగుడుగా, జ‌గ‌న్ ను బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం లో భాగంగా.. చంద్ర‌బాబు టీం ఓ స్కెచ్ వేసింది. జ‌గ‌న్ రోడ్ షో జ‌రుగుతున్న ప్రాంతం నుండి ఓ 108 అంబులెన్స్ ను పంపింది. దాని అర్థం 108లు ప‌నిచేస్తున్నాయి అని చెప్ప‌టంతో పాటు, జ‌గ‌న్ స‌మావేశం వ‌ల్ల 108అందులో ఇరుక్కుపోయింది అని చెప్ప‌టం. కానీ ముందే ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్, ప‌క్క‌న ఇంకో రోడ్డు ఉండ‌గా… పేషేంట్ లేని అంబులెన్స్ ను పంపారు అంటూ నిల‌దీయటంతో, చంద్ర‌బాబు టీం న‌లుక‌ర్చుకుంది. జ‌గ‌న్ ఈ విష‌యంలో… చంద్ర‌బాబును ఇరుకున పెట్టి, ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపుకు తిప్పుకోవ‌టంలో 100కు 100శాతం విజ‌యం సాధించార‌ని విశ్లేష‌కులంటున్నారు.

జ‌గ‌న్ షాక్ తో ఏం చేయాలో తోచ‌ని టీడీపీ, త‌న అనుకూల మీడియాలో… కేవ‌లం జ‌గ‌న్ ఆరోగ్య‌శ్రీ గురించి మాట్లాడుతున్న‌ప్పుడే అంబులెన్స్లు, గ‌ర్బీణీ స్త్రీ వెళ్ల‌టం అంటా ప్లాన్ డ్ గా వైసీపీ చేసింద‌ని ప్ర‌చారం చేస్తోంది. మొత్తానికి ఎత్తుకు పై ఎత్తుల‌తో… వైసీపీ, టీడీపీలు ముందుకెళ్తున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*