ఓవైపు సానుభూతి, మ‌రోవైపు వార‌సురాలికి రూటు క్లియ‌ర్…. అదిరిందయ్యా జ‌గ్గారెడ్డి

Read Time: 0 minutes

ఓవైపు సానుభూతి, మ‌రోవైపు వార‌సురాలికి రూటు క్లియ‌ర్…. అదిరిందయ్యా జ‌గ్గారెడ్డి.

జ‌గ్గారెడ్డి, టీఆర్ఎస్ పై మాట‌ల‌తో విరుచ‌క‌ప‌డే నాయ‌కుడు. అక్క‌డే నుండే… కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చినా, కేసీఆర్ ఫ్యామిలీపై ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డు. అదును దొరికితే చాలు… త‌న ప్ర‌తాపం చూపిస్తాడు. పైగా… జనాల్లో ఉండే నాయ‌కుడు. పైగా ఈసారి గెలుపు గ్యారంటీ అనుకుంటున్న సీట్ల‌లో జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వ‌హించే సంగారెడ్డి కూడా ఒక‌టి.

అయితే, జ‌గ్గారెడ్డిపై ఇటీవ‌లి మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసు ఎప్ప‌టిదో అన్న‌ది అందరికీ తెలుసు. తాజా అరెస్ట్ కూడా అందులో భాగ‌మే. అది జ‌గ‌మెరిగిన స‌త్యం. కానీ ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చాక‌… సంగారెడ్డిలోనే ఉండి, ప్ర‌చారాన్ని ఉరుకులు పెట్టిస్తార‌ని, గెలిచి… త‌న ప్ర‌తాపం చూపిస్తార‌ని అంతా అనుకున్నారు. రోజుకో కామెంట్ తో వార్త‌ల్లో నిలుస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ… ప్ర‌చారం అయితే న‌డుస్తోంది కానీ, ప్ర‌చారంలో జ‌గ్గారెడ్డి క‌న‌ప‌డ‌టం లేదు. త‌న త‌రుపున త‌న బిడ్డ‌ను ప్ర‌చారానికి పంపిస్తున్నారు. కానీ తాను మాత్రం బ‌య‌ట‌కు రావ‌టం లేదు.

దీంతో ఒక్క సంగారెడ్డియే కాదు… యావ‌త్ తెలంగాణ మొత్తం ఏంజ‌రుగుతుంది, జ‌గ్గారెడ్డికి ఏమైంది అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, త‌న కూతురు చెప్తున్న‌ట్లు ఆయ‌న ఆనారోగ్యంగా అయితే లేరు కానీ, కూతురు జ‌యారెడ్డి తో పాటు భార్య‌ను ప్ర‌చారానికి పంపిస్తుంటే మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని తెలుస్తోంది. అందుకే త‌న క‌న్నా… త‌న కూతురుతో ప్ర‌చారం చేయించ‌టం వ‌ల్ల ఓట్ల‌కు ఓట్లు రాలుతాయి, పైగా… త‌న కూతురు సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వార‌సురాలుగా ప‌రిచ‌యం అవుతుంద‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. పైగా… ఆనారోగ్యం కార‌ణంగా రావ‌టం లేదంటే, అక్క‌డ కూడా సానుభూతి. అంటె ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల సామేత అన్న‌ట్లు.

ఇప్ప‌టికైతే జ‌గ్గారెడ్డి ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌న్న‌ది పోలిటిక‌ల్ స‌ర్కిల్ టాక్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*