పోటీలేని ద‌స‌రా, ఎన్టీఆర్ కు క‌లిసొచ్చిన కాలం

Read Time: 1 minutes

ద‌స‌రా అన‌గానే… యూత్ కి గుర్తొచ్చేది హ‌లీడేస్. అందుకే, ఈ హ‌లీడేస్ కోస‌మే…  ప్ర‌త్యేకంగా సినిమాలు రిలీజ్ డేట్స్ చూసుకుంటారు నిర్మాత‌లు. అందుకే ఓక్కోసారి ద‌స‌రా,సంక్రాంతి సీజ‌న్ లో ఒకే రోజు చిన్నా, చిత‌క క‌లిసి అర‌డ‌జ‌న్ కు పైగానే రిలీజ్ అవుతుంటాయి. మినిమం 2 లేదా 3 పెద్ద సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయి. కానీ ఈసారి ద‌స‌రా సీజ‌న్ లో పెద్ద‌గా సినిమా హ‌డావిడే క‌న‌ప‌డ‌టం లేదు. పెద్ద సినిమాల జాడ అయితే అస‌లే లేదు.

ఈ ద‌స‌రాకు రిలీజ్ కాబోతున్న ఏకైక పెద్ద సినిమా ఎన్టీఆర్ దే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్-ఎన్డీయార్ కాంబినేష‌న్లో వ‌స్తున్న ఫ‌స్ట్ మూవీ. సో… అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఈ సినిమా క‌లెక్ష‌న్లు ఎంత ఉంటాయి అంటే భారీగానే ఉండే అవ‌కాశం ఉంది. ఈ సినిమాకు పోటీగా సినిమాలే లేవు. సో థియేట‌ర్లు, క‌లెక్ష‌న్లు అన్నీ ఎన్టీఆర్ కే అన్న‌ట్లు. ద‌స‌రా నాడు యంగ్ హీరో రామ్ హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమాతో వ‌స్తున్నా.. . ఎన్టీఆర్ కు స‌రితూగ లేడు. పైగా వారం గ్యాప్ త‌ర్వాత‌. సో, ఆ సినిమా ఎన్డీఆర్ కు పోటీయే కాద‌న్న‌మాట‌. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ ఉంటుంది, ఎన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుంది అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

హిట్స్ లేని త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో మ‌రోసారి త‌న ఫామ్ కోసం ఆరాట‌ప‌డుతుంటే, భారీ హిట్ కోసం ఎన్టీఆర్ ఎప్ప‌టి నుండో వెయిటింగ్ లో ఉన్నాడు. పోటీయేలేని స‌మ‌యంలో… ఎన్టీఆర్ త‌న మార్క్ ను ఎంత‌మేర‌కు చూపిస్తాడో చూడాలి.

అన్నట్లు… అర‌వింద‌స‌మేత సినిమా ఈ నెల 11న వ‌రల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిపోయింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*