కాద‌న లేక‌, ఔన‌ని చెప్ప‌లేక‌… విచిత్ర ప‌రిస్థితిలో క‌డియం

Read Time: 1 minutes

రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌కే… చిక్కుముడుల‌తో కూడిన రాజ‌కీయం ఎదురైతే ఎలా ఉంటుంది అంటే అందుకు చ‌క్క‌ని ఉదాహార‌ణ ప్ర‌స్తుతానికి క‌డియం శ్రీ‌హ‌రి. తెలుగుదేశంలో కీల‌క వ్య‌క్తిగా, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎం గా ప‌నిచేశారు. కానీ త‌న‌కే రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం స్టేష‌న్ ఘ‌న్ పూర్. అక్క‌డ సిట్టింగ్ డా.రాజయ్య ఉన్నారు. ఆయ‌న‌కే అధిష్టానం టికెట్ ఇచ్చింది. కానీ క‌డియం పై త‌న అనుచ‌రులు పోటీకి ఒత్తిడి తెస్తున్నారు. తన‌కు కూడా అదే ఆలోచ‌న ఉంది. కానీ కేటీఆర్-కేసీఆర్ మాత్రం… మార్చేది లేదంటున్నారు. మూడు సార్లు కేటీఆర్ శ్రీ‌హ‌రిని పిలిపించుకొని మాట్లాడినా, ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఆయ‌న ఇత‌ర పార్టీల‌వైపు చూస్తున్నారు.

క‌డియం వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుండి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయ‌బోతున్నార‌న్న వార్త ఇప్పుడు ఓల్డ్ వ‌రంగ‌ల్ జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. అక్క‌డ కాంగ్రెస్ కు గట్టి అభ్య‌ర్థి లేరు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ లోనే పోటీ చేయాల‌న్న ఒత్తిడి ఉన్నా… అక్క‌డ విజ‌య‌రామారావుకు మంచి పేరుంది.దీంతో ఆయ‌న వ‌ర్ద‌న్న పేట‌కు షిప్ట్ అవుతారు అని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం కోడై కూస్తుంది.

ఇప్ప‌టికే ఒసారి కాంగ్రెస్ లో చేరిక వార్త‌లను కొట్టేసినా, ఆయ‌న అనుచ‌రులు మాత్రం… పోటీ చేయాల్సిందేన‌ని, అవ‌స‌ర‌మ‌యితే పార్టీ మార‌మ‌ని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయ‌న డైలామాలో ప‌డ్డారు.

ఘ‌న్ పూర్ లో రాజ‌య్య‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా, కేసీఆర్ ఎందుకు అర్థం చేసుకోవ‌టం లేద‌ని క‌డియం స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి మినిస్ట‌ర్ హ‌మీ వ‌స్తే చూద్ధాం అని చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*