నాన్నా… నాకో డ‌బుల్ బెడ్ రూం ఇల్లు కావాలి. — ఎంపీ క‌విత‌

Read Time: 0 minutes

సోష‌ల్ మీడియా ట్రోలింగ్ దెబ్బ‌లు ఎలా ఉంటాయో, టీఆర్ఎస్ నేత‌ల‌కు బాగా తెలుసు. తాజాగా ఓ టీవీ చాన‌ల్ లో ఎంపీ క‌విత ఇంట‌ర్వ్యూ వ‌చ్చింది. సీఎం కూతురు, ఎంపీ  కావ‌టంతో… ఆ ఇంట‌ర్వ్యూపై బాగానే ఫోక‌స్ పెట్టారంతా. మ‌ద్య‌లో ఓ సంద‌ర్భంలో… నేను ఉంటున్న‌ది అద్దె ఇల్లు అని క‌విత చెప్ప‌టంతో… నెటిజ‌న్స్, సోష‌ల్ మీడియా ఆంటీ టీఆరెస్ టీం రెండు చేతుల ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది.

బంగారు తెలంగాణ‌లో మీ కుటుంబ‌మే క‌దా బాగుప‌డింది ఇల్లు కొనుక్కోలేదా అని కొంద‌రు, దోచిన డ‌బ్బు ఏం చేశావ్ అని కొంద‌రు ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మొద‌లుపెట్టారు.

కొంద‌రేమో…తన ఎన్నిక‌ల అఫిడ‌విట్ ను సంపాదించి, గ‌త ఎన్నిక‌ల్లో బంజారాహిల్స్ హిల్ కాల‌నీలో ఇల్లు ఉందని అప్పుడెలా చెప్పావ్ అంటూ ట్రోల్ చేశారు. మీ అబద్దాలకు సాక్షాలు అంటూ వైర‌ల్ చేయ‌టంతో… టీఆర్ఎస్ శ్రేణులు సైతం కంగారులో మునిగిపోయాయి. క‌విత‌కు కూడా కేసీఆర్ ఓ డ‌బుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తే పోతుంది కదా, సీఎం మనుమ‌డి తినే తిండే పేద ప్ర‌జ‌ల పిల్ల‌ల‌కు హ‌స్ట‌ల్స్ లో స‌న్న బియ్యం పెడుతున్న‌ప్పుడు, ఇల్లు లేని వారికిచ్చే డ‌బుల్ బెడ్ రూం ఇల్లులో క‌విత‌ను ఉంచితే త‌ప్పేంది అనేది వారి వాద‌న‌. చూస్తుంటే… నిజ‌మే అనిపిస్తున్నా, క‌విత డ‌బుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటుందా…? మ‌రీ వెట‌కారం కాక‌పోతే, ఆమె చెప్ప‌టం వీరు ట్రోల్ చేయ‌టం.

అయితే, దీనిపై క‌విత స‌న్నిహితులు వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న హిల్ కాల‌నీ ఇల్లు అపార్ట్ మెంట్ లో ఓ ప్లాట్.  అయితే, అది చాల‌టం లేద‌ని… ప్ర‌స్తుతం ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుంద‌ని, ఆ విష‌య‌మే తాను చెప్తే… ఇలా అర్థం చేసుకున్నార‌ని మండిప‌డుతున్నారు. ఏదీఏమైనా… సోష‌ల్ మీడియా ట్రోల్ కు క‌విత త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*