కేసీఆర్ కోసం… అస‌ద్ ఆరాటం. త్వ‌ర‌లో టీఆర్ఎస్ కోసం ప్ర‌చారం

Read Time: 0 minutes

టీఆర్ఎస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు అన్నీ ర‌కాల అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది. రాహుల్ మైనారిటీల ల‌క్ష్యంగా… తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి హ‌జ‌రుకాబోతున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా… 2014 నుండి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తోంది. ముఖ్యంగా… మైనారిటీ వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ళ్లీ కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న సంద‌ర్భంలో, తెలంగాణ‌లో మైనారిటీలు టీఆరెఎస్ వైపే ఉండేలా కేసీఆర్ కొత్త ఆలోచ‌న‌ను సిద్ధం చేశారు.

రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ముస్లీం మైనారిటీల సంక్షేమ‌మే ద్యేయమంటూ ఏర్పాటై, వారి వాయిస్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఐఎం… తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో మైత్రీ కొనసాగిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే కేసీఆర్ కూడా స్నేహ‌పూర్వ‌క పోటీ మాత్ర‌మే ఉంటుంద‌ని ఒపెన్ గా చెప్పాడంటే… వారి మ‌ద్య ఉన్న బంధం ఎంత గ‌ట్టిదో చెప్పుకోవ‌చ్చు. అయితే, రాష్ట్రఃలో మైనారిటీ వ‌ర్గాలు దూరం కాకుండా ఉండాలంటే, టీఆర్ఎస్ కోసం… వారి ఓట్లు గ‌ణ‌నీయంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం నేత అస‌ద్ కేసీఆర్ కోసం ప్ర‌చారం చేయ‌బోతున్నారు. గ్రేట‌ర్ జోన్ లో, ఎంఐఎం ఉన్న స్థానాల్లో మిన‌హియిస్తే, మిగ‌తా చోట్ల కేసీఆర్ కు అనుకూలంగా ఓటెయ్యాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌బోతున్నారు. ఇప్ప‌టికే దీనిపై చ‌ర్చ‌లు నడిచిన‌ట్లు ఇరు పార్టీల నేత‌లు అంగీక‌రిస్తున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా, ఇలా అస‌ద్ ఓ పార్టీకి ఓటెయ్యాల‌ని ఇంత‌గ‌ట్టిగా అది తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పింది లేదు. ఇదంతా మైండ్ గేమ్ అన్న వారు కూడా ఉన్నారు. కానీ అస‌ద్ నిజంగా ప్ర‌చారం చేస్తే మాత్రం కేసీఆర్ కు కొంత బూస్ట్ ఇచ్చిన‌ట్లే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*