
పాలమూరు జిల్లాల్లో రెండ్రోజుల పెద్ద నేతల ప్రచారం మొత్తం డీకే అరుణ చుట్టూ తిరుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కీలక నేతగా… క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్ గా పాలమూరు ప్రచారభేరీని అంతా తానే అయి నిర్వహించి, కేసీఆర్ పై కత్తులు దూస్తూ… కాచుకోండి నా కొడకల్లారా అంటూ హెచ్చరించింది.
దీనిపై కేసీఆర్ కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారు. నా కొడకల్లారా అంటావా… నీ బండారం బయటపెడుతా, నీ చరిత్ర ప్రతి ఇంటీకీ చేరేలా తిరుగుతా, నువ్వు పాలమూరు శనిలా దాపురమయ్యావంటూ ఫైర్ అయ్యారు. పాలమూరు నీళ్లను దోచుకెళ్తుంటే… హరతులిస్తావా అని విమర్శించారు.
ఇటు డీకే అరుణ కూడా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అవును మళ్లీ మళ్లీ అంటా… నా టీఆర్ఎస్ కొడుకుల్లారా, దుబాయ్ శేఖర్ గా నీబాగోతం బయటపెడుతా అంటూ కేసీఆర్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది డీకే. కత్తులు తిప్పినం అంటున్నావ్… ఎస్. తిప్పుతం, తెలంగాణ ఝాన్నీ లక్ష్మీబాయ్ లా పోరాడుతా… నీ నుండి తెలంగాణను కాపాడుతా అంటూ హెచ్చరించారు.
రఘువీరా రెడ్డికి హరతి పట్టిన అంటావ్… ఝూటాకోర్ వి నువ్వు, ఒక్క పోటో చూపియ్యి… హరతి పట్టినట్లు అంటు సవాలు విసిరారు. పూటకో మాట మారుస్తూ, ఫాం హౌజ్ లో పడుకునే నీవు మా గురించి మాట్లాడటమా….? పాలమూరు ఎంపీగా ఉండి, నీవు నేరవేర్చిన ఘనకార్యం అందరికీ తెలుసు, మాయల ఫకీర్ వేషం వేసుకొని ప్రజలను మోసం చేయటం నీ నైజం అంటూ గట్టిగానే బదులిచ్చారు. తెలంగాణ మహిళల తరుపున, జోగుళాంబ తల్లి సాక్షిగా శాపం పెడతున్న… నిన్ను గద్దె దింపుతం, టీఆఆరెస్ పార్టీ నాశనం కాక తప్పదు అంటూ హెచ్చరించారు.
Leave a Reply