సొంత కొడుకే… కేసీఆర్ ను జంతువు తో పోల్చాడు

Read Time: 0 minutes

టీఆర్ఎస్ పార్టీ నేత్లో  కేసీఆర్, హ‌రీష్, కేటీఆర్, క‌విత విమ‌ర్శ‌లు ఒక్కోర‌కంగా ఉంటాయి. కేసీఆర్, హ‌రీష్ వాఖ్య‌లు ప‌రిణితి, చాక‌చ‌క్యంతో ఉంటే… కేటీఆర్ వాఖ్య‌లు కాస్త గ‌మ్మ‌త్తుగా, ఒక్కోసారి తేడా గా ఉంటాయి. ఇటీవ‌ల కేటీఆర్ వివిధ స‌భ‌ల్లో మాట్లాడుతూ… కేసీఆర్ సింహాం లాంటి వాడ‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌లు కేసీఆర్ కు ఎక్క‌డా స‌రిపోర‌ని, పిల్లులాంటి వారంటూ విమ‌ర్శించారు.

అయితే, దీనిపై నెటిజ‌న్స్ కాస్త డిఫ‌రెంట్ గా స్పందిస్తున్నారు. అదెంటీ సీఎంను, ఉద్య‌మ‌నేత కేటీఆర్ అలా ఎలా అన్నాడంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఎంతో స‌హృద‌యుడు అంటూ టీఆర్ఎస్ నేత‌లు కేసీఆర్ ను దైవంగా భావిస్తే, సొంత కొడుకే… సింహాం అంటూ క్రూర జంతువుతో ఎలా పోల్చాడంటూ విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సింహాం ఇత‌ర జంతువుల‌ను వెటాడి చంపి తింటుంద‌ని… కేసీఆర్ కూడా అలాగే అమాయ‌క కాంగ్రెస్ నేత‌ల‌ను, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కేసుల్లో ఇరికిస్తూ… హింసిస్తున్నాడ‌ని మండిపడుతున్నారు. ఏ ఉద్దేశంతో కేటీఆర్ సింహం అంటూ జంతు పోలిక‌తో పోల్చాడు కానీ, కేటీఆర్ నిజం చెప్పాడ‌ని… ఒక‌రకంగా చూస్తే పిల్లులే ఎంతో న‌య‌మ‌ని అంటున్నారు. పిల్లులైన కాస్త తిండిపెట్టిన య‌జ‌మానికి విశ్వాసంతో ఉంటాయ‌ని, సింహానికి అది కూడా ఉండ‌ద‌ని విరుచుక‌ప‌డుతున్నారు. అందుకే తెలంగాణ ఇచ్చిన విశ్వాసం, కేంద్ర‌మంత్రిని చేసిన విశ్వాసం కూడా లేకుండా… కాంగ్రెస్ ను, కాంగ్రెస్ నేత‌లైన సోనియా,రాహుల్ ను నోటికొచ్చిన‌ట్లు విమ‌ర్శిస్తున్నాడ‌ని మండిప‌డుతున్నారు.

మ‌రీ సోష‌ల్ మీడియాను విప‌రీతంగా ఫాల్ అయ్యే… కేటీఆర్, ఈ సింహాం కామెంట్ ను ప‌క్క‌న పెడుతారో, పట్టించుకోకుండా… దీర‌త్వానికి సింబ‌ల్ గా కంటిన్యూ చేస్తారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*