సెంటిమెంట్ కోస‌మే కేసీఆర్ ఆరాటం

Read Time: 0 minutes

కేసీఆర్ రెండోవిడ‌త ప్ర‌చారం మొద‌లుపెట్టాక‌… ఆయ‌న ఒక ఎజెండాతో ముందుకుపోతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇన్నాళ్లు… అది ఇది చేశాం అంటూ అభివృద్ధి ప‌థ‌కాల‌ను ముందు పెట్టుకొని ప్ర‌చారం నిర్వ‌హించే ఏర్పాట్లు చేసుకున్నారు. వారి లైన్ కూడా ప‌థ‌కాల చుట్టూనే ఉండేది. కానీ కేవ‌లం ప‌థ‌కాల‌తోనే పోతే, గెలుపు క‌ష్టం అవుతుంద‌న్న అంచాన‌తోనే సెంటిమెంట్ ను ర‌గిల్చే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్.

అందుకే మ‌ళ్లీ చంద్ర‌బాబు ను తిట్టిన తిట్లు తిట్ట‌కుండా తిడుతూ… ప్ర‌జ‌ల్లో ఒక‌ప్ప‌టి సెంటిమెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అయితే… కాంగ్రెస్ నేత‌ల‌ను ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అన‌టం లేదు. వారి పేరే ఎత్త‌టం లేదు. కానీ చంద్ర‌బాబును ఓటుకు నోటు నుండి… ప్ర‌తి అంశంలో, ఆంద్రా తెలంగాణ వ్యాత్యాసం ఉండేలా… జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతుంది. అందుకే నోటికి ప‌నిచేప్తున్న‌ట్లు ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఒక‌ప్పుడు ప‌థ‌కాల‌తో వైఎస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన‌ట్లు వ‌చ్చే ప‌రిస్థితి ఇప్పుడు లేద‌న్న‌ది కేసీఆర్ కు అర్థ‌మ‌వుతోంది. అందుకే ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ఇటు  కోదండ‌రాం ను గానీ, కాంగ్రెస్ లో తెలంగాణ కోసం కొట్లాడిన వారిని ప‌ల్లెత్తు మాట అన‌టం లేదు. ఒక‌శాతం, అర‌శాతం ఉన్న ఓటు బ్యాంకు పార్టీ టీడీపీ అంటూనే… చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌టం అంటే దాంట్లో మ‌ర్మం అదే అని స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మ‌రోవైపు ఒక పించ‌న్లు మిన‌హా ఇత‌ర ఏ హ‌మీల‌ను కేసీఆర్ నిర్ధిష్టంగా చెప్ప‌లేక‌పోవ‌టం మైన‌స్ గా మారుతోంది. ఇక‌… కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే, ఉత్త‌మ్ ప్ర‌భుత్వంలోకి వ‌స్తే ఏం చేస్తారో చెప్తూ ప్ర‌చారం చేయ‌టం కూడా కేసీఆర్ పై ప్రేష‌ర్ పెంచుతున్న‌ట్లుగా క‌న‌ప‌డుతోంది.

టీఆర్ఎస్ పార్టీ వెన‌క‌ప‌డుతుంద‌ని అర్థ‌మ‌య్యే… హ‌రీష్ ను మ‌ళ్లీ  మ‌చ్చిక చేసుకోవ‌టం, కేసీఆర్ సెంటిమెంట్ పై ప‌డ‌టం చూస్తుంటే… మ‌హ‌కూట‌మి సెగ త‌గిలిన‌ట్లే ఉంద‌న్న ప్ర‌తిప‌క్షాల మాట‌. చూడాలి రానున్న రోజుల్లో ప్ర‌చారం ఎలా ఉండ‌బోతుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*