పొత్తుల‌పై క‌త్తులు, బూతుపురాణం తో కేసీఆర్

Read Time: 0 minutes

త‌మ‌కు మాత్ర‌మే ద‌క్కాల‌నుకున్న‌ది వారి కండ్ల ముందే… దూరం అయ్యే సూచ‌న‌లు క‌న‌ప‌డుతుంటే ఎలా ఉంట‌ది, కేసీఆర్ ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌హ‌కూట‌మి అంటూ  కాంగ్రెస్ టీడీపీ జ‌త‌క‌ట్ట‌డంపై తొలిసారి కేసీఆర్ స్పందించారు. బండ‌బూతులు తిడుతూ… త‌న ఫ్ర‌స్ట్రేష‌న్ ను బ‌య‌ట‌పెట్టారు. ఏ సెంటిమెంట్ తో అయితే, 2014లో గెలిచారో మ‌ళ్లీ అలాంటి సెంటిమెంట్ ర‌గిల్చేందుకు కృషి చేసిన‌ట్లు కేసీఆర్ నిజామాబాద్ స‌భ చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కేసీఆర్… అంత‌టితో ఆగ‌కుండా,  డిల్లీకి, అమ‌రావ‌తికి గులాం గిరిచేసేందుకేనా అంటూ ద్వ‌జ‌మెత్తారు.

ఒక‌టికి, రెంటికి పోవాల‌న్న డిల్లీ ప‌ర్మిష‌న్ కావాలా,  ఓటుకు నోటులో ప‌ట్టుబ‌డ్డ దొంగ చంద్ర‌బాబు అంటూ తీవ్ర ప‌ద‌జాలాన్ని వాడారు. 500కోట్ల‌కు పైగా చంద్ర‌బాబు డ‌బ్బులు పంపుతున్నారని, తెలంగాణ బిడ్డ‌ల‌ను గొస‌పెట్టి, ఎన్ కౌంట‌ర్లు చేసిన దుర్మార్గుడు చంద్ర‌బాబు అంటూ బాబుని టార్గెట్ చేసి, సెంటిమెంట్ ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ క‌న్నా ఎక్కువ  చంద్ర‌బాబును ఎక్కువ టార్గెట్ చేస్తూ, కొత్త చ‌ర్చ‌కు తెర‌తీశారు కేసీఆర్.

గ‌తంలో… తెలంగాణలో టీడీపీయే లేద‌న్న కేసీఆర్, ఈరోజు చెడిపోయి చంద్ర‌బాబుతో దోస్తీకి చెస్తున్నార‌ని, సిగ్గులేదా అంటూ ప‌రుష ప‌ద‌జాలాన్ని వాడారు. హెలికాప్ట‌ర్లు కూడా చంద్ర‌బాబు బుక్ చేశార‌ని… మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ర‌గిల్చేందుకు కృషిచేశార‌న్న‌టాక్ విన‌ప‌డుతోంది.

అయితే, గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చారాన్ని మొద‌లుపెడుతున్న కాంగ్రెస్, కేసీఆర్ వాఖ్య‌ల‌ను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*