ముంద‌స్తొస్తేనే ఇంత వ్య‌తిరేక‌త ఉంటే, ఎన్నిక‌లు వాయిదా ప‌డితే…..?

Read Time: 0 minutes

కొండ నాలుక‌కు మందేస్తే… ఉన్న నాలుక‌కు ఉడింద‌న్న చందంగా త‌యారవుతోంది టీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి. ప్ర‌తిప‌క్షాలు మేల్కొక ముందే, పూర్తిస్థాయిలో ప్ర‌జా వ్య‌తిరేక‌త ముద‌ర‌క‌ముందే, దేశంలోని ఎన్నిక‌ల వాత‌వ‌ర‌ణం రాష్ట్రంపై ప‌డ‌క‌ముందే… ఎన్నిక‌లకు వెళ్లి, గెలిచి రావాల‌ని ఎంతో ఆశ‌తో ముంద‌స్తుకు సిద్ధ‌మైన టీఆర్ఎస్ పార్టీకి వాతావ‌ర‌ణం  ఏమాత్రం అనుకూలించ‌టం లేదు. ఆపార్టీ ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి, ప్ర‌చారం మొద‌లుపెట్టింది. కానీ, అభ్య‌ర్తుల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లినా… ఏం చేసిన‌వ‌ని మ‌ళ్లొచ్చిన‌వ్, ఎందుకొచ్చిన‌వ్ అంటూ మొఖం మీదే నిల‌దీస్తుండ‌టంతో, నేత‌లకు ఏంచేయాలో పాలుపోవ‌టం లేదు. స్థానిక నేత‌లు ప్ర‌స్తుతానికి స‌ర్ధిచెప్తున్నా, పోలింగ్ తేదీ వ‌చ్చే నాటికి ప‌రిస్థితి మ‌రింత తీవ్ర‌మవుతుంద‌ని టీఆరెస్ నేత‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. కాస్త ముందుగా అయినా, నేత‌ల‌కు ముంద‌స్తుపై సంకేతాలు ఇచ్చివుంటే… కొన్ని ప‌నులైన చేసుకొని ఉండేవాళ్లం, ఇంకా స‌మ‌య‌ముంద‌ని కొంద‌రు, నిర్ల‌క్ష్యంతో కొంద‌రు నేత‌లు… ప‌నులు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయ‌న్న‌దానిపై దృష్టిపెట్ట‌లేదు. పైగా కేసీఆర్ షాక్ ఇవ్వ‌టంతో… అభ్య‌ర్థులంతా హైరానా ప‌డిపోతున్నారు. 

కొన్ని చోట్ల ఈ అభ్య‌ర్థికి అయితే అసలే ఓటు వేయ‌మ‌ని, మా ఊరుకు అధికార పార్టీ నేత‌లు రావొద్ద‌ని కొన్ని ఊర్లు బోర్డులు పెట్టేస్తున్నాయి. వ‌రంగల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్, మ‌హ‌బూబ్ బాద్ నియోజ‌క‌వ‌ర్గాలు, ఆలేరు నియోజ‌క‌వ‌ర్గాల్లో వీడియోల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చాయంటే ప‌రిస్థితి ఏవిదఃగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఇన్నాళ్లు ఆ ప‌థ‌కం, ఈ ప‌థ‌కం అంటూ… జ‌నాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోలేక‌పోయిన‌ట్లు గా టీఆర్ఎస్ పార్టీ క‌న‌ప‌డుతోంది. అధినేత స‌ర్వేల్లో అంతా ఒకే అన‌టంతో… నేత‌లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఎన్నిక‌లు ముంచుకొస్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే… ఎన్నిక‌లు వ‌చ్చే రోజు స‌రికి, ఈ వ్య‌తిరేకత టీఆర్ఎస్ పార్టీకి న‌ష్టాన్ని, కాంగ్రెస్ కూట‌మికి మేలు చేయ‌బోతుందంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*