కొండ‌గట్టు బ‌స్సు ప్ర‌మాద బాదితుల‌కు చెల్ల‌ని చెక్కులు

Read Time: 0 minutes

అస‌లే అయిన వారిని కోల్పోయారు. కొంత‌మంది… క్ష‌తగాత్రులైనారు. త‌మ‌కే ఎందుకు ఇలా జ‌రిగిందో అంటూ… రోజులు వెళ్ల‌దీస్తూ వ‌స్తున్న కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాద బాధితుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. బ‌స్సు ప్ర‌మాదం స‌మ‌యంలో త‌మ‌కు అండ‌గా ఉండాల్సిన నేత‌లు, నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టం అక్క‌డి ప్ర‌జ‌ల్ని క‌ల‌చివేస్తోంది. గ‌తంలో వైఎస్, చంద్ర‌బాబు… అదే కొండ‌గట్టులో స్వ‌ల్ప ప్ర‌మాదాలు జ‌రిగినా వ‌చ్చి, ఓదార్చారు. కానీ కేసీఆర్ రాలేదు.

పైగా, ప్ర‌బుత్వం త‌రుపున 8ల‌క్ష‌ల వ‌ర‌కు ఎక్స్ గ్రేషియా… ప్ర‌క‌టించారు. అధికారులు వ‌చ్చి, చెక్కులు ఇచ్చిన వారికి… బ్యాంకు అధికారులు న‌మ్మ‌లేని నిజం చెప్పారు. పేరుకే ప్ర‌బుత్వ చెక్కుల‌నీ, కానీ వాటిలో డ‌బ్బులేద‌ని బ్యాంకు స్ప‌ష్టం చేయ‌టంతో బాధితులు నోరేళ్ల‌పెట్టారు. వెంట‌నే వారు స్థానిక ఆర్డీవో కార్యాల‌యానికి వెళ్లి,ఆర్డీవోను నిల‌దీయ‌గా… ఆయ‌న నోటికొచ్చిన బూతుల‌న్నీ తిడుతూ… బ‌య‌ట‌కు పంపించ‌టంతో చేసేదేమీ లేక ఏడూస్తూ ధ‌ర్నాకు దిగారు బాధితులు. తాము న‌క్స‌లైట్ల‌లా క‌నిపిస్తున్నట్లుంద‌ని, మాకు ఇప్పుడు న్యాయం చేసేదేవ‌రంటూ… బాధితులు క‌న్నీరు మున్నీర‌య్యారు.

గ‌తంలో… సొంత గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే చిన్నారులు రైలు ప్ర‌మాదంలో చ‌నిపోతే ప‌రామ‌ర్శ‌కు కూడా పోని కేసీఆర్, కొండ‌గ‌ట్టు ప్ర‌మాద బాధితుల ప‌రామ‌ర్శ‌కు కూడా పోలేదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*