మ‌హ‌కూట‌మిలో సీట్ల విభ‌జ‌న ఇంకెప్పుడు

Read Time: 0 minutes

టీఆర్ఎస్ ను గ‌ద్దె దింట‌మే ల‌క్ష్యంగా పురుడుపోసుకుంది మ‌హ‌కూట‌మి. ఇన్నాళ్లు వేర్వేరుగా ఉన్న భిన్న దృవాలు ఒక్క‌గూటికైతే చేరాయి కానీ, సీట్ల విభ‌జ‌న అంశం అన్ని పార్టీల్లోనూ భిన్న స్పంద‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఎవ‌రికి వారు త‌మ స్వంత ప్ర‌యోజ‌నాలను భేరీజు వేసుకుంటుండ‌టంతో, మ‌హ‌కూట‌మిలో సీట్ల పంచాయితీ ఎటూ తేల‌టం లేదు. అస‌లైన బ‌లాబ‌లాల ప్రాతిపాధిక‌న కాకుండా… సీట్ల సంఖ్య పై ప్ర‌తిష్ట‌కు పోతుండ‌టంతో సీట్ల కేటాయింపు తుది ద‌శ‌కు రావ‌టం లేదు.

ఓవైపు ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్య‌ర్థులు నెల‌రోజులుగా ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. కానీ అవ‌త‌లి పార్టీగా ఇంకెప్పుడు ప్ర‌జ‌ల్లోకి పోతాం అన్న‌ది అభ్య‌ర్థులు, ఆశావాహుల అస‌లు ప్ర‌శ్న‌. కాంగ్రెస్ త‌రుపున మొద‌టి జాబితాను… సీనీయ‌ర్ల‌కు సీట్లు ఇస్తూ జాబితా విడుద‌లకు కాంగ్రెస్ రెడీ అయినా, పొత్తు ధ‌ర్మంతో కాస్త వెనుకంజ వేస్తుంది. కానీ ఈ పంచాయితీ ఇప్ప‌ట్లో తేలుతుందా… అంటే చెప్ప‌లేం. మ‌రీ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా వెళ్తుందా అంటే లేదు. సో… మ‌హ‌కూట‌మి చ‌ర్చ‌లు… చ‌ర్చ‌ల‌తోనే స‌రిపోతున్నాయి. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌లు కూడా లేదు. ప్రచారం చేయాల్సిన నేత‌లు హోట‌ళ్ల‌లో కూర్చోని చ‌ర్చ‌లు చేస్తే, ప్ర‌చారం ప‌రిస్థితి ఏంటీ…?  కూట‌మి క‌ట్టిన విష‌యం గ్రౌండ్ లోకి వెళ్లాలి, నేత‌ల మ‌ద్య స‌ఖ్య‌త రావాలి, అసంతృప్తుల‌ను బుజ్జ‌గించాలి… ఇలా ఎన్నో అంశాలు మిగిలే ఉన్నాయి. దీంతో… కాంగ్రెస్ నేత‌లు జాబితా విడుద‌లకు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం ఒక‌టి రెండు రోజుల్లో ఈ త‌తంగానికి ముగింపు ప‌ల‌కాల‌ని యోచిస్తున్నారు. ఇంకా స‌మ‌యం వృదా చేస్తే… మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*