మంథ‌ని మాజీ ఎమ్మెల్యే పుట్ట‌మ‌ధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Read Time: 0 minutes

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మ‌ధు దౌర్జ‌న్యాలు అంతా ఇంతా కాదు. మంథ‌ని ప్రాంతంలో తాను, త‌న అనుచ‌రులు ఈ నాలుగున్న‌రేళ్ల వీరంగం తర్వాత ఆయ‌న దౌర్జ‌న్యాలు ఒక్కోటి బ‌య‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అక్ర‌మాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న‌కు… హ‌త్య కేసు మెడ‌కు చుట్టుకుంది. తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా… 2013లో గుండా నాగ‌రాజు అనే వ్య‌క్తి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. తెలంగాణ ఉద్య‌మం కోస‌మే ఆత్మ హ‌త్య చేసుకున్నార‌ని అంతా అనుకున్నారు. కానీ అస‌లు విష‌యం భ‌య‌ట‌కు పొక్కింది. నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య ఉదంతంలో ఆయ‌న‌ను ఆత్మ‌హాత్య చేసుకోవ‌డానికి ప్రేరేపించిన వారిలో పుట్టా మ‌ధు కూడా ఉన్న‌ట్లు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి.

2013లో కేసీఆర్ మంథ‌నిలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ ప‌లు పార్టీలు మారుస్తూ… వ‌చ్చిన పుట్టామ‌ధు, స్థానిక సీనీయ‌ర్ నేత సునీల్ రెడ్డిలు టీఆరెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో… పుట్టామ‌ధు త‌న ప‌లుకుబ‌డిని చూపిస్తూ, కేసీఆర్ స‌భ‌లో ఆత్మ‌హాత్య చేసుకునేలా నాగ‌రాజు ను ప్రేరేపించాడ‌న్న‌ది ప్రధాన ఆరోప‌ణ‌. దీనికి సంబఃదించిన కాల్ డేటా తో పాటు, 50వేల రూపాయాలు కూడా ఇచ్చిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్ష్యాదారాలు ఉన్నాయ‌ని తాజాగా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయింది. ప్ర‌స్తుతం పుట్టామ‌ధు రెండోసారి మంథ‌ని నుండి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోబుత‌న్నారు.

ఇటీవ‌లే ఓ వ్య‌క్తి త‌న‌కు పుట్టామ‌దు నుండి ప్రాణ‌హ‌ని ఉంద‌ని ఏకంగా డీజీపీకే ఫిర్యాదు చేయ‌టం సంచ‌ల‌నం గా మారింది. అంత‌కుముందు కూడా ద‌ళిత యువ‌కుడి ప్రేమ విష‌యంలో, హ‌త్య జ‌రిగిన తీరుపై కూడా మ‌ధుపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

2014లో పుట్టా మ‌ధు కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత శ్రీ‌ధ‌ర్ బాబుపై విజ‌యం సాధించారు. ఒక‌ప్పుడు పుట్టా మ‌ధు కూడా శ్రీ‌ధ‌ర్ బాబు అనుచ‌రుడే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*