మైనారిటీ ఓట్ల ల‌క్ష్యంగానే… రాహుల్ వ‌న్ డే టూర్

Read Time: 1 minutes

రాష్ట్రంలో గెలుపోట‌ములను శాసించే స్థాయిలో ఉన్న మైనారిటీ ఓట‌ర్ల లక్ష్యంగానే రాహుల్ ఈసారి తెలంగాణ టూర్ కు రాబోతున్నారు. టీఆర్ఎస్-బీజేపిలు కలిసి వెళ్తున్నాయ‌న్న ప్రచారం ఉదృతంగా ఉన్న నేపధ్యంలో… మైనారిటీ ఓట్లు త‌మ‌కే ప‌డాల‌న్న లక్ష్యంతో వ్యూహాలు ర‌చిస్తున్నారు. టీఆరెస్-బీజేపిల ర‌హ‌స్య‌మైత్రి, టీఆర్ఎస్-ఎంఐఎంల ఒప్పందం ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని కాంగ్రెస్ నేత ఒక‌రు వాఖ్యానించారు.

ఇది త‌మ‌కు అడ్వాంటేజ్ అవుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ స‌భ‌ల‌ను ఆ వ‌ర్గం టార్గెట్ గానే ఏర్పాటు చేస్తోంది. రాహుల్ ఈనెల 20న హైద‌రాబాద్ రానున్నారు. విమానాశ్ర‌యం నుండి నేరుగా చార్మినార్ ప్రాంతంలో రాజీవ్ స‌ద్భావ‌న యాత్ర‌లో పాల్గొంటారు. అక్క‌డ వేల సంఖ్య‌లో ముస్లిం-మైనారిటీలు స‌భ‌కు వ‌చ్చేలా ప్లాన్ చేశారు. అక్క‌డ నుండి నేరుగా… అదిలాబాద్ జిల్లా బైంసాలో స‌భ‌కు మ‌ద్యాహ్నం హ‌జ‌ర‌వుతారు. అక్క‌డ కూడా మైనారిటీ వ‌ర్గం బ‌లంగా ఉంది. అక్క‌డి  నుండి నేరుగా కామారెడ్డి స‌భ‌కు సాయంత్రం హ‌జ‌ర‌వుతారు. ఈ మూడు స‌భ‌లు మైనారిటీలు అత్య‌ధికంగా ఉన్న స్థానాలే కావ‌టం గ‌మ‌నార్హం.

గ‌త ఎన్నిక‌ల్లో కూడా… మైనారిటీల ఓట్లు చీల‌టం వ‌ల్ల‌, కాంగ్రెస్ అబ్య‌ర్థులు చాలామంది వెయ్యి,రెండు వేల లోపు మెజారిటీతోనే ఓట‌మి పాల‌య్యార‌ని పీసీసీ అంచ‌నా వేస్తోంది. అందుకే ముందు మైనారిటీ టార్గెట్ గా వెళ్తూ, కేసీఆర్ కు చెక్ పెట్టాల‌ని… త‌ద్వారా బీజేపీ-ఎంఐఎం కూడా న‌ష్ట‌పోతాయ‌ని, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఇది త‌మ‌కు లాభం చేకుర్చుతుంద‌ని… ఇటీవ‌ల రాష్ట్రంలో ప‌ర్య‌టించిన రాహుల్ దూత అంటున్నారు.

చూడాలి మ‌రీ… రాహుల్ కొత్త స్కెచ్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుదంతుందో…

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*