పాల‌మూరు లో వార్ వ‌న్ సైడే

Read Time: 0 minutes

తెలంగాణ ముందస్తు ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలతో పాటు.. జిల్లాల రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. మార్పులు చేర్పులతో జిల్లా పాలిటిక్స్‌లో కొత్త ఉత్సాహాం నెలకొంటుంది. పాలమూరు జిల్లాలో కాంగ్రస్ పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఆనందం నెలకొంది. ఎందుకంటే పాలమూరులో ఎటు చూసిన పార్టీకి బలమైన నాయకత్వమే కనిపిస్తుంది.

సీనీయర్ నాయకురాలు డీకే అరుణ దగ్గర్నుంచి… నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వరకు ఎక్కడ చూసిన జనాదారణ ఉన్న నాయకులే ఉన్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంంది. తమ అభిమాన నేతల్ని ఎన్నికల్లో గెలిపించడం కోసం కార్యకర్తలు సైతం చెమటోడ్చేందుకు సిద్దమయ్యారు. దీంతో పాలమూరులోని అరుణ, రేవంత్, సంపత్, వంశీచంద్ , నాగం గెలుపు పక్కా అన్న సమాచారం వ్యక్తమవుతుంది.

పాలమూరు జిల్లాలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యకర్తలు రెడీ అవుతున్నారు. పాలమూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధిష్టానం ఇప్పటికే అక్కడ మెజార్టీ సీట్లు సాధించే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. పార్టీ బలంగా ఉన్నా ఇక్కడ నేతల మధ్య మాత్రం అభిప్రాయబేధాలున్నట్లు హైకమాండ్‌కు సమాచారం అందింది. దీంతో ఈ సమస్యను రూపుమాపి పార్టీని ముందుకు నడిపేందుకు అధిష్టానం చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు పరీశీలకులు ముందు చెప్పుకొచ్చారు. జిల్లాలో బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వర కు పార్టీకి బలమైన క్యాడర్‌ ఉందని, క్షేత్రస్థాయి లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, గెలుపే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

వీటికి తోడు రానున్న ఎన్నికల్లో పార్టీ టీడీపీతో పొత్తుకు రెడీ అయ్యింది. దీంతో మిగిలిన చోట్ల పొత్తులు లాభం చేస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు, పార్టీకి ఉన్న బలమైన క్యాడర్‌తో రానున్న ఎన్నికల్లో పాలమూరును స్వీప్ చేయడం ఖాయమన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*