ఆప‌ద ప‌ట్ట‌ని సినీ తార‌లు, స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు

Read Time: 0 minutes

ఒక్క కాకికి ఎదైనా అయితే, వంద‌ల కాకులు ఒక్క‌ద‌గ్గ‌ర‌కు చేరుత‌యి. ఓ ప‌క్షికున్న జ్ఙానం లేకుండా పోయింది సినీ ప్ర‌పంచానికి. ఎంతో అభిమానం చూపించే ప్ర‌జ‌లు… క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు తోడుండాల్సిన బాధ్య‌త కొంతైనా ఉంది. ఇటీవ‌లి కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు ఎన్నో చేతులు స‌హాయం చేశాయి. అయితే… తిత్లీ దెబ్బ‌కు విల‌విలలాడుతోంది శ్రీ‌కాకుళం జిల్లా. 18మండ‌లాలు స‌ర్వ‌నాశ‌నం అయ్యాయి. క‌నీవినీ ఎరుగ‌ని న‌ష్టం జ‌రిగింది. ఎంతో మంది త‌మ వంతు స‌హాయానికి ముందుకు వ‌స్తున్నారు. కానీ సీనీ పెద్ద‌ల‌కు మాత్రం మ‌న‌సు రావ‌టం లేదు.

తిత్లి భీబ‌త్సానికి కొంతైనా అండ‌గ ఉండేందుకు వ్యాపార వేత్త‌లు ముందుకు వ‌స్తున్నారు. కానీ స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్న సినితార‌లు మాత్రం చేతులుముడుచుకొని కూర్చున్నారు. కొద్దిమంది మాత్ర‌మే త‌మ‌కు తోచిన స‌హ‌యం చేయ‌గా, చాలా మంది మ‌న‌కేందుకులే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌హ‌యం చేసిన వారిలో… ఎన్టీఆర్ 15ల‌క్ష‌లు, క‌ళ్యాణ్ రామ్ 5ల‌క్ష‌లు, ఇలాంటి వాటిలో ఎప్పుడూ ముందుండే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సంపూర్ణేష్ బాబు త‌దిత‌రులు త‌మ‌కు తోచిన స‌హాయం చేశారు. ఇక బ‌డా హీరోలు, నిర్మాత‌లు అయితే… త‌మ‌కు విష‌య‌మే తెలియ‌ద‌న్నంత మౌనాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. త‌మిళ న‌టుల‌ను చూసి నేర్చుకోవాల్సింది తెలుగు న‌టుల‌కు ఎంతో ఉంద‌ని, సామాజికి సృహాలో త‌మిళ న‌టులు  ఆద‌ర్శ‌ప్రాయుల‌ను కొనియాడుతున్నారు. ఇప్ప‌టికైనా… ప్ర‌భుత్వం నుండి వారికి స‌హాయం అందేలా… ప్ర‌బుత్వ నిధికి తోచిన స‌హాయం అందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*