చంద్ర‌బాబు ఆర్థిక వ‌న‌రులే టార్గెట్ గా బీజేపీ

Read Time: 0 minutes

ఓవైపు చంద్ర‌బాబు… బీజేపీ పై క‌త్తులు దూస్తుంటే, బీజేపీ సైలెంట్ గా చంద్ర‌బాబుకు చెక్ పెట్టే ప‌నిలో ప‌డింది. రాజ‌కీయంగా… చంద్ర‌బాబును ఏమీ చేయ‌లేమ‌ని, ఈ స‌మ‌యంలో ఏమైనా చేస్తే చంద్ర‌బాబుకు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని గ్ర‌హించిన బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం, ఆ పార్టీ ఆర్థిక మూలాల‌పై క‌న్నేసింది. ప‌దేండ్లు అధికారంలో లేక‌పోయినా, పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్న కేంద్ర‌ మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి, ఎంపీ సీఎం ర‌మేష్ స‌హా మంత్రి నారాయ‌ణ‌తో పాటు టీడీపీ ఆర్థిక స‌హాయం చేస్తున్న నేత‌ల‌పై వ‌రుస‌గా ఐటీ దాడుల‌కు పూనుకుంది.

పైకి త‌మ‌కు సంబందం లేద‌ని చెబుతున్నా, స్థానిక బిజేపి నేత‌ల డైరెక్ష‌న్ లో ప‌క్కా ప్ర‌ణాళిక‌తో… బీజేపీ ముందుకు వెళ్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. టీడీపీ నేత‌లు, వారి అనుకూలుర అవినీతి అంశాలు బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా, టీడీపీని ఎదుర్కొవ‌చ్చ‌న్న‌ది ఆ పార్టీ ఆలోచ‌నగా క‌న‌ప‌డుతోంది. పైగా… ప్ర‌స్తుత ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అర్థిక వ‌న‌రుగా టీడీపీ స‌హాయం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ చేస్తోన్న కృషికి బీజేపీ, టీఆర్ఎస్ ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో… వెంట‌నే ఐటీని రంగంలోకి దించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇప్పటికే ఏపీలో ఐటీ, ఈడీ దాడుల ప‌ట్ట చంద్ర‌బాబు అసంతృప్తిని వ్య‌క్తం చేసినా, అది రాజ‌కీయ కోణంలోకి మార్చ‌లేక‌పోయారు. దీంతో… ఐటీ దూకుడు పెంచేలా చేసింది బీజేపి.

రానున్న రోజుల్లో… ఈ దాడులు మ‌రింత జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, టీడీపీ ఎంపీల్లో చాలా మంది వ్యాపారస్థులే అయినందున‌, వారిపై కూడా దాడులు నిర్వ‌హించి, ఇటు తెలంగాణ‌లో కూట‌మిని, అటు ఏపీలో  టీడీపీ ప‌నిప‌ట్టాల‌ని చూస్తోంది బీజేపి. మ‌రీ వారి ప్లాన్ ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*