దూకుడు పెంచిన కూట‌మి, ప‌టాన్ చెఱు టీడీపీకి

Read Time: 1 minutes

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో… కూట‌మిలోని ప‌క్షాల‌న్నీ దూకుడు పెంచాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ త‌రుపున కొన్ని ఎన్నిక‌ల హ‌మీల‌ను ప్ర‌క‌టించ‌టంతో, కూట‌మిలోని మ‌రో ప్ర‌ధాన పార్టీ టీడీపీ కూడా ఎన్నిక‌ల హ‌మీల‌ను ప్ర‌క‌టించింది. దాదాపు కాంగ్రెస్ ఎన్నిక‌ల అంశాల‌నే అన్ని పార్టీలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నట్లు క‌న‌ప‌డుతున్నాయి.

ఇక పొత్తుల్లో భాగంగా… సీట్ల స‌ర్ధుబాటు పై కొంత స్ప‌ష్ట‌త  వ‌స్తోంది. పొత్తుల్లో భాగంగా… ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌టాన్ చెఱు నుండి టీడీపీ పోటీ చేయ‌బోతుంది. అక్క‌డ సెటిల‌ర్లు, టీడీపీ బ‌లం ఎక్కువ ఉండ‌టంతో టీడీపీకి ఇచ్చేందుకు కూట‌మి ప‌క్షాల‌న్నీ సానుకూలత వ్య‌క్తం చేశాయి. అందుకే అక్క‌డ గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన నందీశ్వ‌ర్ గౌడ్ టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ అబ్య‌ర్థిగా పోటీచేయ‌నున్నారు. ఆయ‌న కాంగ్రెస్ నుండి బీజేపీకి వెళ్లి, కొంత‌కాలం క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌చ్చారు. డీఎస్ తో పాటు కాంగ్రెస్ లో చేరుతారు అని అంతా భావించారు. కానీ పొత్తుల్లో భాగంగా… సీటు టీడీపీకి వెళ్తుండ‌టంతో ఆయ‌న టీడీపీకి జై కొట్టారు.

ఇప్ప‌టికే ఉప్ప‌ల్ స్థానం కూడా టీడీపీకి ఇచ్చేందుకు కూట‌మి సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా గ్రేట‌ర్ చుట్టూ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే టీడీపీ ఎక్కువ‌గా పోటీచేసే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నాయకులంటున్నారు. త‌ద్వారా సెటిల‌ర్ల ఓట్లు చీల‌కుండా… 2014 ఎన్నిక‌ల్లో బీజేపి-టీడీపీ కూట‌మి విజ‌యాన్ని రీపీట్ చేయోచ్చ‌న్న‌ది వీరి ఆలోచ‌న‌.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*