తెలంగాణ పాలిటిక్స్‌కు ఎన్నారైస్ టెన్షన్

Read Time: 0 minutes

తెలంగాణ ముందస్తు ఎన్నికలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో పడ్డారు. ఎవరికి ఏ సీటు ఇవ్వాలి.. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్న పనిలో తలమూనకలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నారైలు.. వారికి పెద్ద టెన్షన్ గా మారారు. ఎందుకంటే పలు పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఎన్నారైలు పదుల సంఖ్యలోనే ఉన్నారు.

అందుకే ఇప్పుడు అన్ని పార్టీలకు ఎన్నారైల టెన్షన్ పట్టుకుంది. సీట్లకోసం స్థానిక నేతలతో పాటు వారు కూడా పోటీ పడటంతో… దీనికి పరిష్కారం ఎలా అని అన్ని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. డజనుకుపైగానే పలు పార్టీల్లో ఎన్నారై ఆశావాహులున్నట్లు సమాచారం. దీంతో అలాంటివారికి  ఎలా బుజ్జగించాలి? ఎవ‌రెవ‌ర‌కి  టికెట్లు కేటాయించాల‌న్న దానిపై పార్టీలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. వీటిపై ఆయా పార్టీల  అధినాయకత్వాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలకు అనేకమంది ఎన్నారైలు అండగా ఉన్నారు. సామాజిక సేవలు చేస్తూ .. పార్టీలకు ఫండ్ కూడా కల్పించారు. దీంతో వారికి సీట్ల విషయంలో ఎలాంటి న్యాయం చేయాలో తెలియక సతమతమవుతున్నారు నాయకులు.

నల్గొండ జిల్లాలో ఎన్నారైల సీట్ల పోటీ కాస్త‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. హుజూర్ నగర్, నియోజకవర్గం టికెట్‌ను ఎన్నారై సైదిరెడ్డికి ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నా… తెలంగాణ అమరవీరుడు శ్రీకంతాచారి తల్లి శంకరమ్మ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎన్నారై సైదిరెడ్డి విషయంలో ఏం చేయాలన్న దానిపై టీఆర్ఎస్ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఒక్క సైది రెడ్డియే కాదు.. ఇలా రానున్న ఎన్నికల్లో టికెట్లు ఆశించే ఎన్నారై ఆశావాహులు ఎక్కువ మందే ఉన్నారు. ఇక ఈ పోటీ కాంగ్రె్స స్ పార్టీ జిల్లా నాయ‌క‌త్వాన్ని కూడా ఇరుకున పెడుతోంది.  దీంతో వారికి పార్టీలు న్యాయం చేస్తాయా? లేక మొండిచేయి చూపిస్తాయా? ఎన్నారైలకు నిరాశ తప్పదా ? అన్న విషయాలు తెలాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*