న‌న్ను న‌గ్నంగా షూట్ చేశారంటున్న సౌత్ ఇండియ‌న్ బ్యూటీ

Read Time: 1 minutes

దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం రేపుతోన్న మీటూ… ఉద్య‌మంలోకి మ‌రో హీరోయిన్ చేరిపోయింది. సౌత్ ఇండియ‌న్ స్టార్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మ‌డుకు కూడా లైంగిక వేధింపులు త‌ప్ప‌లేద‌ట‌. తానే స్వ‌యంగా… త‌నకు ఎదురైన అనుభ‌వాల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చాటి చెప్పింది సంజ‌నా.

గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీగా పేరొందిన సీనీ ప్ర‌పంచంలో… ఇలాంటి చీక‌టి ప్ర‌పంచంపై అనేక ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న సంద‌ర్భంలో… నాకు లైంగిక వేధింపులే కాదు, న‌న్ను న‌గ్నంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. నా ప్రైవేటు పార్ట్స్ ను షూట్ చేశారు అంటూ ఓపెన్ అయింది. నేను 15 సంవ‌త్సారాలున్న‌ప్పుడు సినీరంగం పై ప్రేమ‌తో వ‌చ్చాను. అప్పుడు నేను ప్ల‌స్ వ‌న్ చ‌దువుతున్నా. ఓవైపు సినిమాలు చేస్తూ, చ‌దువు కంటిన్యూ చేయాల‌న్న‌ది నా ఆలోచ‌న‌. హిందీ సినిమా మ‌ర్డ‌ర్ ను క‌న్న‌డ‌లో రీమెక్ చేస్తున్న సినిమా. ఆ స‌మ‌యంలో… ఆ చిత్రంలో ఉన్న అశ్లీల స‌న్నివేశాల‌ను చేసేందుకు నేను ఒప్పుకోలేదు. స‌రే తీసేస్తామ‌ని చెప్పి, షూటింగ్ కోసం బ్యాంకాక్ తీసుకెళ్లారు. మా అమ్మ‌ని… హోటల్ కే ప‌రిమితం చేసి, నేను ఎంత వ‌ద్ద‌ని చెప్పినా… బెదిరించి మ‌రీ నాపై ముద్దుల స‌న్నివేశాలు, నా మ‌ర్మంగాల‌ను షూట్ చేశారంటూ వాపోయింది. నేను ఎంత వ‌ద్ద‌ని మొత్త‌కున్నా… నా కేరీర్ ను నాశ‌నం చెస్తామ‌ని, మా నుండి నువ్వు ఎంతో దూరం వెళ్ల‌లేవ‌ని బెద‌రించిన‌ట్లు తెలిపింది. అలా త‌న‌కు ఎదురైనా లైంగిక వేధింపుల‌పై మీటూ అంటూ షేర్ చేసింది సంజ‌నా.

సంజ‌నా క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాలం బాష‌ల‌లో ప‌లు సినిమాల్లో న‌టించింది. తెలుగులో ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన  బుజ్జిగాడు, దండుపాళ్యం-2, అవును-2, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, దండుపాళ్య‌-3లాంటి ప‌లు చిత్రాల్లో న‌టించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*