దామోద‌ర అంతపెద్ద‌ బెదిరింపుతోనే… ప‌ద్మిణీ వెన‌క్కి

Read Time: 0 minutes

దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా. మాజీ డిప్యూటీ సీఎంయే కాదు, ప్ర‌స్తుత సీఎం ఆశావాహుల్లో ఆయ‌న ఒక‌రు. పైగా ఆయ‌న‌కు ఆయ‌న సామాజిక వ‌ర్గం పెద్ద ఆస్తి. పైగా ఇప్పుడు ఎన్నిక‌ల వ‌రాల క‌మిటీ చైర్మ‌న్. కానీ, త‌న‌కు ప్ర‌త్య‌ర్ధుల నుండి కాదు, సొంత భార్యే షాకివ్వ‌టంతో తేరుకోలేక‌పోయిన దామోద‌ర‌, సాయంత్రం క‌ల్లా మ‌ళ్లీ త‌న భార్య‌ను వెన‌క్కి రప్పించాడు. అస‌లు ఆమె ఎందుకు బీజేపీ నుండి తిరిగి వ‌చ్చింది. అస‌లేం జ‌రిగింది.

త‌న రాజ‌కీయ ఆకాంక్ష‌తో ఉద‌యం బీజేపీలో చేరిన దామోద‌ర బార్య ప‌ద్మిణీరెడ్డి, రాత్రిక‌ల్లా మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. అయితే… ఉద‌యం నుండి సాయంత్రం మ‌ద్య‌లో ఇంట్లో  అనేక హైడ్రామాలు న‌డిచాయ‌ని తెలుస్తోంది. బీజేపీలోకి త‌న భార్య వెళ్లింద‌ని తెలియ‌గానే ఆయ‌న‌, త‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున దామోద‌ర ఇంటికి చేరుకున్నారు. ఇలాగైతే త‌మ‌కు ఆందోళ్ లో పెద్ద ఇబ్బంద‌ని, తలెత్తుకొని తిర‌గ‌లేమ‌ని… పైగా హ‌రీష్ మీ భార్య‌కే మీ హ‌మీలు న‌చ్చ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టార‌ని చెప్ప‌గానే, దామోద‌ర్ కూడా వెంట‌నే త‌న భార్య‌కు ప‌లు సార్లు ఫోన్ చేశాడు.

త‌న బావ‌మ‌ర్ధుల‌తో కూడా మాట్లాడాడు. ఇలాగైతే త‌న ప‌రువేం కావాల‌ని, పెద్ద నేత‌గా ఉన్న త‌న‌కు త‌లెత్తుకొని ఎలా పార్టీ ఆఫీసుకు, జ‌నాల్లోకి వెళ్తాన‌నుకున్నారు అంటూ మండిప‌డ్డారు. మీ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. కానీ ప‌ద్మిణీరెడ్డి, ఆమె సోద‌రులు ఓద‌శ‌లో స‌సేమిర అన్న‌ప్ప‌టికీ,

తాను ఈ విష‌యంలో ఎంత‌దూర‌మైనా వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని, త‌న మాట నెగ్గాల్సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌టంతో వెన‌క్కిత‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఎంత‌దూరం అయినా అన్న ప‌దంలో… విడిగా ఉండేందుకు కూడా అన్న అర్థం వ‌స్తుంది. అందుకే ప‌ద్మిణీరెడ్డి తిరిగి వ‌చ్చి, కాంగ్రెస్ లో చేరింద‌ని తెలుస్తోంది. ఇదంతా అక్క‌డి కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకోవ‌టం విశేషం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*