కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌ల‌కు ఇంటిపోరు.

Read Time: 0 minutes

కాంగ్రెస్ లో సీనీయ‌ర్ నేత‌ల‌కు ఇంటిపోరు మొద‌లైంది. ఎలాగోలా ఈసారి గెలిచితీరాల‌న్న క‌సితో నేత‌లుంటే, త‌మ‌కు టికెట్ కావాలంటూ… వార‌సులు ముందుకురావ‌టంతో అస‌లు క‌థ కొత్త ట‌ర్న్ తీసుకుంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఎంతో మంది నేత‌లు ట్రై చేసినా, ఉత్త‌మ్ ఒక్క‌డే త‌న భార్య‌కు టికెట్ ఇప్పించుకొని, గెలిపించుకోగ‌లిగాడు. మిగితా నేత‌ల‌కు అధిష్టానం నో చెప్పింది.

కానీ, ఈసారి కూడా నేత‌ల వార‌సులు టికెట్స్ కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర త‌న భార్య‌కోసం ప్ర‌య‌త్నించీ, ప్ర‌య‌త్నించీ…. టికెట్ రాద‌ని డిసైడ్ అయిపోయారు. కానీ ఆయ‌న భార్య ప‌ద్మిణీ రెడ్డి బీజేపీ తీర్థః పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం హ‌ట్ టాపిక్ అయింది. మ‌రికొంత మంది సీనీయ‌ర్స్ వార‌సుల‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే, వారు కూడా ఇత‌ర పార్టీలోకి వెళ్తే… ఎట్లా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం గా మారింది. ఇత‌ర పార్టీ నేత‌లు ఇప్ప‌టికే… ఇలాంటి నేత‌ల కోసం కాచుకొని కూర్చున్నారు. ప్ర‌త్యేకంగా బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు టికెట్స్ ఫైన‌ల్ అయ్యే వ‌ర‌కు టికెట్స్ అనౌన్స్ చేసే అవ‌కాశం క‌నిపించ‌టం లేదు.

దీంతో, అభ్య‌ర్థుల పేర్లు ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్న టీపీసీసీ నాయ‌క‌త్వానికి ఇది ఇప్పుడు స‌వాల్ గానే మారింద‌ని చెప్పుకోవ‌చ్చు. సీనీయ‌ర్ నేత‌లు నేరుగా… ఎవ‌రికి వారు డిల్లీ పెద్ద‌ల‌తో మాట్లాడినా, వారు కూడా ఉత్త‌మ్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని చెప్ప‌టంతో… ఉత్త‌మ్ ఏం చేస్తార‌న్న‌ది కీల‌కంగా ఉంది. కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌ల వార‌సుల టికెట్స్ అంశం ఇప్పుడు ఉత్త‌మ్ కోర్టులో ఉంది. చూడాలి మ‌రీ ఉత్త‌మ్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*