అవినీతి ఆరోప‌ణ‌లతోనే రేపే ప‌రీక్ష‌

Read Time: 0 minutes

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఆందోళ‌న‌కు గురిచేస్తున్న పంచాయితీ కార్య‌ద‌ర్శి ప‌రీక్ష బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. అయితే, మామాలు ప‌రీక్ష‌లాగే అయితే, ఇది వార్త కాదు. కానీ పంచాయితీ కార్య‌ద‌ర్శి ఎగ్జామ్ కు ప్ర‌భుత్వం విధించిన విధి,విధానాలు, అభ్య‌ర్థుల‌పై ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఇందులో అవినీతి ఉంది, ద‌ళారీలు ఇప్ప‌టికే డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నిరుద్యోగుల విషయంలో… ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ స‌ర్కార్, పంచాయితీ కార్య‌ద‌ర్శి పోస్టుల విష‌యంలో మాత్రం దూకుడుగా వెళ్లింది. మాములుగా అయితే 2నెల‌ల‌కు పైగానే స‌మ‌యం ఇచ్చి ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. తెలంగాణ వ‌చ్చాక‌… ప‌రీక్ష‌లు చివ‌రి నిమిష‌యంలో ర‌ద్దు కావ‌టం, లేదా ఇత‌ర‌త్రా వాయిదాలు కామ‌న్ అయిపోయాయి. కానీ ఈ ప‌రీక్ష‌లో అలా జ‌ర‌గ‌లేదు.

పైగా ఈ ప‌రీక్ష‌ను జెన్.టీ.యూ.హెచ్ కు అప్ప‌గించారు. ఎంసెట్ ప‌రీక్ష‌లు, ఫ‌లితాల అంశౄల్లో కార్పోరేట్ కాలేజీల అండతో అవినీతి చేస్తార‌న్న ఆరోప‌ణ‌లు ఈ యూనివ‌ర్శిటీపై ఉన్నాయి. ఇప్పుడు అదే యూనివ‌ర్శిటీ ఎగ్జామ్ నిర్వ‌హిస్తోంది. పైగా… అభ్య‌ర్థులకు ప్ర‌శ్నాప‌త్రం ఇవ్వ‌రు. తాము ప్ర‌శ్నాప‌త్రం బ‌య‌ట‌కు ఇవ్వ‌మ‌ని, ఎమ్మెఆర్ షీటు న‌క‌ల్ కాపీ కూడా బ‌య‌ట‌కు పంపివ్వం అంటూ గైడ్ లైన్స్ విడుద‌ల చేశారు. ఎవ‌రైనా వీటిని అతిక్ర‌మిస్తే… క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది.

పార‌ద‌ర్శ‌త కోస‌మే… న‌క‌ల్ కాపీలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు అవి ఇవ్వ‌ము, ప్ర‌శ్నాప‌త్రం కూడా ఇవ్వ‌ము అంటే ఇందులో ఏదో ర‌హ‌స్యం ఉంద‌ని, అవినీతికి ఆస్కారం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, దీనిపై యూనివ‌ర్శిటీ కానీ, పంచాయితీరాజ్ శాఖ కానీ స్పందిచ‌టం లేదు. చూడాలి మ‌రీ బుధ‌వారం ఎగ్జామ్ త‌ర్వాత ఎన్ని వివాదాలు ఈ ఎగ్జామ్ ను చుట్టుముడుతాయో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*