రాహుల్ తో కూట‌మి భేటీ, సీట్ల కోస‌మేనా…?

Read Time: 0 minutes

రాహుల్ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో మైనారిటీ వ‌ర్గాల ఓట‌ర్ల టార్గెట్ అన్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. అందుకు ఆయ‌న ఎంచుకున్న బ‌హిరంగ స‌భ‌ల ప్లేసులు చూస్తే చాలు. ఇదిలా ప‌క్క‌న పెడితే, రాహుల్  మ‌రో కీల‌క భేటీలో పాల్గొన‌బోతున్నారు. కేసీఆర్ ను గ‌ద్దేదింపే ల‌క్ష్యంగా జ‌ట్టుక‌ట్టిన తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో ఆయ‌న స‌మావేశం కాబోతున్నారు.

రాహుల్ తో భేటీలో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్, ఇంచార్జీ కుంతియాల‌తో పాటు, టీజెఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం స‌మావేశం కాబోతున్నారు. ఈ సమ‌వేశానికి టీడీపీ ఎల్. ర‌మ‌ణ‌, సిపిఐ నుండి చాడ వెంక‌ట్ రెడ్డి త‌దిత‌రులు కూడా హ‌జ‌రుకాబోతున్నారు.

రాష్ట్రంలో కూట‌మిగా జ‌ట్టుక‌ట్టిన త‌ర్వాత‌, జ‌ట్టు క‌ట్టేందుకు కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడి హోదాలోనే ఇంత‌వ‌ర‌కు అధికారికంగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. రాహుల్ కు స‌మాచారం ఉన్నా… ఆయ‌న ఇంత‌వ‌ర‌కు నేరుగా వీరిని క‌ల‌వ‌లేదు. అయితే, ఈ భేటీలో రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు, ప్ర‌చారంలోకి ఎంచుకోవాల్సిన అంశాలు, ఏయే చోట్ల ఎలాంటి ప‌రిస్థితులున్నాయి, ఎలా ఉమ్మ‌డిగా ముందుకు వెళ్తే… లాభం చేకూరుతుంద‌న్న అంశాల‌ను చ‌ర్చించ‌బోతున్నారు. ఉమ్మ‌డి ప్రణాళిక ద్వారా ఎన్నిక‌ల హ‌మీలు ఇవ్వాల‌న్న అంశాన్ని ఫైన‌ల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇక సీట్ల స‌ర్ధుబాటు అంశం కూడా ఎదో ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా సీట్ల స‌ర్ధుబాటు తేల్చాల‌ని…. కోదండ‌రాం ఇప్ప‌టికే కోరుతూ వ‌స్తున్నారు.

ఈసారి రాహుల్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌… భ‌విష్య‌త్ లో జ‌ర‌గ‌బోయే ప‌ర్య‌ట‌న‌ల్లో కూట‌మి నేత‌లు కూడా అధికారికంగా పాల్గొంటాయ‌ని కాంగ్రెస్ నేత‌లు తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*