సెమీ ఫైనల్ ఎన్నిక‌లు…. రాజ‌స్థాన్ ముఖ‌చిత్రం

Read Time: 1 minutes

2019 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న మ‌రో రాష్ట్రం రాజ‌స్థాన్. ఉత్తరాధి రాష్ట్రం అయిన రాజ‌స్థాన్ వెన‌క‌బాటులోనే ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. అయితే, అక్క‌డ రాజ‌కీయం నిల‌కడ‌గా ఉండ‌దు. అదే అక్క‌డ అభివృద్దిలేమికి కార‌ణం అన్న వాద‌న‌లు కూడా ఉన్నాయి. అయితే, రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉండ‌గా, కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంగా ఉంది.

మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు గ‌ల రాజ‌స్థాన్ లో 2013 ఎన్నిక‌ల్లో బీజేపి మోడీ ప్ర‌భంజ‌నంతో… భారీ మెజారిటీతో గెలిచింది. అక్క‌డ బిజేపికి 160, కాంగ్రెస్ 25, బీఎస్పీ 2, ఇలా ఇత‌ర పార్టీలు ఉన్నాయి. అంత‌కు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉండేది. గ‌త నాలుగైదు ఎన్నిక‌ల నుండి అక్క‌డ ఓసారి బీజేపికి, మ‌రోసారి కాంగ్రెస్ కు అధికారం కట్ట‌బెడుతున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఈసారి అక్క‌డ బీజేపీ సీఎం వ‌సుంద‌రరాజేపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలుస్తోంది.

అన‌వాయితీలాగే అక్క‌డ కాంగ్రెస్ కు ప‌ట్టం క‌డుతార‌ని స‌ర్వేలు చెబుతుండ‌గా, కాంగ్రెస్-బీజేపీలు ప్ర‌చారంలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. అయితే, మోడీ చ‌రిష్మా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క డిల్లీలో మిన‌హా… ఎక్క‌డా పోలేదు. ఉత్త‌రాధిపార్టీగా, ఉత్త‌రాధ‌ధిలో బ‌ల‌మైన పార్టీగా ఉన్న బీజేపీకి రాజ‌స్థాన్ లో గ‌డ్డుకాలమే ఉంద‌ని తెలుస్తోంది. అధికార‌పార్టీగా ఎన్నిక‌ల‌కు వెళ్తుంది.  బీజేపి మ‌రోసారి మోడీ-షాపైనే ఆశ‌లు పెట్టుకోగా, ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చే చివ‌రి నిమిషం వ‌ర‌కూ… సీఎంను మార్చాల‌న్న అసంతృప్తి సొంత‌పార్టీలోనే వ్య‌క్త‌మ‌యింది.

ఓవైపు కాంగ్రెస్ రాజ‌స్థాన్ లో దూకుడుగా వెళ్తుంది. బూత్ లెవ‌ల్ ప్ర‌చారంలో బీజేపి క‌న్నా వెన‌క‌బ‌డ్డా, అక్క‌డ గ‌తంలో సీఎంగా ప‌నిచేసిన అశోక్ గెహ్ల‌ట్, రాహుల్ అత్యంత స‌న్నిహితుడు సచిన్ ఫైలట్ వ‌ర్గాలు కాంగ్రెస్ లో కీల‌కంగా ప‌నిచేస్తున్నాయి.అయితే, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ లో లాగే ఇక్క‌డా… ఈఇద్ద‌రి మ‌ద్య వ‌ర్గ‌విభేదాల‌తో పార్టీకి కొన్నిచోట్ల ఇబ్బంది ఉన్నా… రాహుల్ ఐక్యతామంత్రంతో వారు ముందుకు వెళ్తున్నారు. అక్క‌డ బీఎస్పీకి,  ఇత‌ర చిన్న పార్టీల‌కు కొంత ఓటు బ్యాంకు ఉంది. దీంతో వారిని క‌లుపుకు పోవ‌టంతోనే అధికారం ద‌క్కుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ స్థానికంగా ఎన్నిక‌ల స‌ర్ధుబాట్లు మొద‌ల‌య్యాయి.

మొత్తంగా… ఈసారి ఏ పార్టీ గెలిచినా, అక్క‌డ కొత్త సీఎం వ‌చ్చే అవ‌కాశం ఉంది. రెండు పార్టీల్లోనూ అసమ్మ‌తి వాదుల బెడ‌దా ఉంది. అయితే, రాజ‌స్థాన్ ఈసారి కాంగ్రెస్ వ‌శం అవుతుంద‌ని, ఇక్క‌డి నుండి మ‌ళ్లీ కాంగ్రెస్ పున‌ర్వైభ‌వానికి పునాదులు ప‌డుతాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*