కేసీఆర్ కు షాకిచ్చిన ఎమ్మెల్సీ, త్వ‌ర‌లో కాంగ్రెస్ కు

Read Time: 1 minutes

కేసీఆర్ అనుంగ శిష్యుడు, లంబ‌డా వ‌ర్గ బ‌ల‌మైన నాయ‌కుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ… రాములు నాయ‌క్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబుతున్నారు. 2001 నుండి కేసీఆర్ వెన్నంటే ఉన్న త‌న‌కు పోటీకి అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని, త‌మ వ‌ర్గానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్న‌డ‌ని… రాములు నాయ‌క్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ గా ఉన్నా… తాను నారాయ‌ణ‌ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. కాంగ్రెస్ లో అక్క‌డ బ‌లంగా ఉన్న క్రిష్టారెడ్డి కుటుంబం నుండి పోటీకి ఎవరూ రెడీగా లేక‌పోవ‌టంతో… రాములు నాయ‌క్ కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అదిష్టానం కూడా రెడీ అయింద‌ని తెలుస్తోంది.

ఈ నెల 20న రాహుల్ స‌మ‌క్షంలో… రాములు నాయ‌క్ కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు. కొంత‌కాలంగా అసంతృప్తితో ఉన్నార‌ని తెలిసి, కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడిన ఫ‌లితం లేకుండా పోయింది.  2014 నుండి అవ‌కాశం ఇస్తామ‌ని చెబుతున్నా, త‌మ‌ను దూరంపెడుతున్నార‌ని… రాములు నాయ‌క్ వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు.  ఇప్ప‌టికే గిరిజ‌నులు-లంబాడాల మ‌ద్య రాచ‌కున్న చిచ్చుతో, గిరిజ‌నులు టీఆర్ఎస్ కు దూరం కాగా, లంబాడాలు కూడా ఇప్పుడు దూరం కానుండటంతో, టీఆర్ఎస్ వ‌ర్గాల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*