సూర్యాపేట‌లో గెలుపుకోసం ఒక్క‌టైన సామాజిక‌వ‌ర్గాలు

Read Time: 1 minutes

రాజ‌కీయంలో ఎత్తులు.. ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ‌రూ ఊహించ‌లేరు. సూర్యాపేట రాజ‌కీయాలు కూడా అందుకు అతీతం కాదు. సూర్యాపేట‌లో కాంగ్రెస్-టీఆర్ఎస్ హోరాహోరీ త‌ల‌ప‌డుతున్నాయి. ఇద్ద‌రు మాజీ మంత్రుల స‌వాల్… అందులోనూ, ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ద్య పోరు అంటే… ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

టీఆర్ఎస్ నుండి జ‌గ‌దీష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి దామోద‌ర్ రెడ్డి పోటీచేయ‌బోతున్నారు. అయితే, వీరిద్ద‌రు ఈసారి ఎలాగైనా గెలిచితీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో… ఏ ఒక్క చిన్న అవ‌కాశాన్ని కూడా జార‌విడ‌వ‌కూడ‌ద‌ని ఇద్ద‌రూ పోటాపోటీగా వ్యూహాల్లో త‌ల‌మున‌క‌లైనారు. అయితే… ఎన్నిక‌ల్లో ఎప్ప‌టికైనా సామాజిక వ‌ర్గాలు కీల‌క‌మైన‌వి. సూర్యాపేట‌లో త్రిముఖ‌పోరు ఉండ‌నుంది. బీజేపి  నుండి సంకినేని వెంక‌టేశ్వ‌ర్రావు పోటీలో ఉండ‌నున్నారు. అయితే,  సంకినేని గ‌తంలో కూడా భారీగా ఓట్లు చీల్చ‌టం వ‌ల్లే… చివ‌ర్లో జ‌గ‌దీష్ రెడ్డి గెలుపొందారు.

ఈసారి కూడా సూర్యాపేట‌లో అదే ఫార్మూల అప్లై చేసి, పింక్ లోట‌స్ ఫార్మూలాను తెర‌పైకి తీసుక‌రానుంది. జ‌గ‌దీష్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు. కేటీఆర్ తో కూడా అదే సాన్నిహిత్యం మెయింటెన్ చేస్తాడు. అందుకే జ‌గ‌దీష్ రెడ్డిని గెలిపించేందుకు సంకినేని హెల్ప్ తీసుకోబోతున్నారు . సంకినేని, కేసీఆర్ ఓకే సామాజిక వ‌ర్గం చేందిన నాయ‌కులు కావ‌టంతో… అటు నుండి స్కెచ్ వేశారు. ఈసారి నేరుగా త‌ల‌ప‌డితే జ‌గ‌దీష్ రెడ్డి ఓట‌మి పాల‌వ్వ‌టం ఖాయం. ఇటు సంకినేని కూడా గెల‌వ‌లేడు. దీంతో రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డిని ఓడించేందుకు సామాజిక వ‌ర్గాల ద్వారా సంకినేని-జ‌గ‌దీష్ రెడ్డి ఒక్క‌ట‌య్యార‌ని సూర్యాపేట కోడై కూస్తోంది. పైగా బీజేపి-టీఆర్ఎస్ ల మ‌ద్య ఒప్పందం కూడా వారికి అడ్వాంటేజ్ అయింది.

పింక్-లోట‌స్ ఫార్మూలాతో వెళ్తున్న‌… సంకినేని-జ‌గ‌దీష్ రెడ్డిల‌కు ఎన్ని కూయుక్తులు ప‌న్నినా… ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఈసారి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి విజ‌యం ప‌క్కా అంటున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఈసారి దామోద‌ర్ రెడ్డి మంత్రిగా ఉండ‌బోతున్నారంటున్నారు ఆయ‌న వ‌ర్గీయులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*