క‌త్తి గ‌ట్టిన మీడియాపై రేవంత్ న‌జ‌ర్

Read Time: 0 minutes

ఇన్నాళ్లు నాయ‌కుల‌తోనే నెక్ టూ నెక్ ఫైట్ లో ఉన్న కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… మీడియా అధినేత‌ల‌పై దృష్టిపెట్టాడు. త‌న‌పై ఐటీ దాడుల స‌మ‌యంలో, చేస్తున్న స‌మ‌యంలో… కొన్ని ప్ర‌సార మాద్య‌మాల్లో రేవంత్ టార్గెట్ గా వార్త‌లు, చ‌ర్చ‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. కొన్ని చాన‌ళ్లో… రేవంత్ అకౌంటు నెంబ‌ర్లు, డిపాజిట్లు, లావాదేవీలు అంటూ ఆధారాల పేప‌ర్లంటూ చూపిస్తూ… చ‌ర్చ‌లు నడిపారు.

దీంతో, స‌ద‌రు చానెళ్ల‌పై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. త‌ప్పుడు డాక్యుమెంట్ల‌తో నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేశారంటూ… నోటీసులిచ్చే ప‌నిలో ప‌డ్డారు. ఇటీవ‌ల చేతులు మారిన  టీవీ9 రామేశ్వ‌ర్రావు, న‌మ‌స్తే తెలంగాణ‌, టీన్యూస్ ఎండీ సంతోష్ రావుల‌కు నోటీసులిచ్చిందుకు ఆయ‌న రెడీ అయ్యారు.

ఆ మూడు సంస్థ‌లు త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి, త‌న కు అకౌంటే లేనిది… ఉన్న‌ట్లు ప్ర‌చారం చేశార‌ని మండిప‌డుతున్నారు. త‌నను వ్య‌క్తిగ‌తంగా ఎదుర్కొనేందుకు, త‌న‌పై వ్య‌క్తిగ‌త వార్త‌లు రాసేవారు ఒక‌టి రెండు సార్లు నిర్ధారించుకున్నాకే రాయాల‌ని, లేక‌పోతే మిగతా వారిపై కూడా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చరిస్తున్నారు.

ఇప్ప‌టికీ కూడా త‌న‌పై చేసిన నిరాధార ఆరోప‌ణ‌ల విష‌యంలో… అవి నిరూపిస్తే, ఆయా మీడియా సంస్థ‌ల‌కే ఆ ఆస్తులు ఇచ్చేస్తాన‌ని ఆయ‌న స‌వాలు చేశారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*