RX100 సినిమా త‌ర‌హా ప్రేమ‌. రెండు ప్రాణాలు బ‌లి

Read Time: 0 minutes

స‌మాజంలో… టీవీలు, సినిమాలు ఎంత ప్ర‌భావం చూపించ‌గ‌ల‌వో నిరూపించే ఘ‌ట‌న ఇది. జగిత్యాల జిల్లాలో జ‌రిగిన ఇద్ద‌రు స్నేహితుల ఆత్మ‌హాత్య‌ల క‌థ‌లో కొత్త‌కోణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  ఒకే స్కూల్ లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌ద‌వే, ఈ ఇద్ద‌రు స్నేహితులు ప్రేమించింది ఒకే అమ్మాయిని. ఒకే అమ్మాయితో ఇద్ద‌రు చాటింగ్ చేసేవారు. తాము ల‌వ్ చేస్తుంది ఒకే అమ్మాయిని అని ఇద్ద‌రికీ తెలిశాక గొడ‌వ‌లు ప‌డ్డారు, కొట్టుకున్నారు.

ఎప్ప‌టిలాగే… చిన్న ఘ‌ర్ష‌ణ మొదైలంది. ఇద్ద‌రు ఆ అమ్మాయితో కాస్సేపు చాటింగ్ చేసి, ఒక నిర్ణయానికి వ‌చ్చారు. మొద‌ట ఇద్ద‌రు ఫుల్ గా మ‌ద్యం సేవించి, ఊరు చివ‌ర‌కు పెట్రోల్ క్యాన్ తో వెళ్లారు.   ఇటీవ‌ల విడుద‌లై తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఆర్.ఎక్స్. 100 సినిమా లో హీరో ల భావించారు. ఆ సినిమాలో హీరో  ఓ పాట‌లో… తాను చావ‌డాక‌నికి సిద్ధం అయి, హీరోయిన్ పై దాడికి య‌త్నించినట్లే… వీరు కూడా ఒకరిపై ఒక‌రు దాడి చేసుకున్న‌ట్లుగా… పెట్రోల్ పోసుకొని, ఒక‌రికొక‌రు నిప్పంటించుకున్నారు.

సినిమాలు మ‌నుషుల‌ను మారుస్తాయ‌ని తెలుసు కానీ, ఇలా ప్రాణాలు తీసుకుంటాయా అంటూ వారి బందువులు రోదించ‌టం అక్క‌డున్న వారంద‌రినీ  కంట‌త‌డిపెట్టించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*