సెమీస్ లో విజేత కాంగ్రెస్సే…

Read Time: 1 minutes

దేశంలో అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు  ముందు జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌లను అన్నీ పార్టీలు సెమీఫైన‌ల్ గా భావిస్తున్నాయి. కేవ‌లం వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందు జ‌రుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు  అన్నీ పార్టీలు నువ్వా-నేనా అన్న‌ట్లు దూసుకెళ్తుండ‌గా, ఎన్నిక‌లు జ‌రుగుతున్న  మెజారీటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండ‌టంతో, ఈ ఎన్నిక‌లు ప్రధాని  మోడీ ప‌నితీరుకు రెఫ‌రెండం కాబోతున్నాయి.

మ‌ద్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ ఘ‌డ్, రాజ‌స్థాన్ లో బీజేపీ ప్ర‌భుత్వాలుండ‌గా, తెలంగాణ ప్రాంతీయ‌పార్టీ, మిజోరాంలో కాంగ్రెస్ ఉంది. అయితే, బీజేపీ పాలిత మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎదురీదుతుంది. మ‌ద్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ఏక‌ప‌క్ష విజ‌యం సాధిస్తుంద‌ని ఇప్ప‌టికే స‌ర్వేల‌న్నీ కోడై కూస్తుండ‌గా, బీజేపీకి ఇవి చావోరేవో అన్న‌ట్లు త‌యారైంది. మోడీ చ‌రిష్మాకు, అమిత్ షా వ్యూహాల‌కు ప‌రీక్ష పెడుతోంది. 4సారి వరుస‌గా బీజేపీని గెలిపిస్తారా…అన్న చ‌ర్చ ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉండ‌గా, రాజ‌స్థాన్ లో వ‌సుంద‌ర రాజే  కు అగ్ని ప‌రీక్ష గా మారింది.

బీజేపీ గాలిలో కాంగ్రెస్ నుండి ప‌వ‌ర్ ద‌క్కించుకున్న ఆమె, ఈసారి బంగారు ప‌ల్లెంలో పెట్టి మరీ కాంగ్రెస్ కు అధికారం అప్ప‌గించ‌నుంద‌ట‌. చ‌త్తీస్ ఘ‌డ్ లో మాత్రం నువ్వా-నేనా అన్న ప‌రిస్థితులున్నాయ‌ట‌. బీజేపీ-కాంగ్రెస్-జ‌న‌తా కాంగ్రెస్ చ‌త్తీస్ ఘ‌డ్ లాంటి పార్టీలు పోడీప‌డుతుండగా ప‌రిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఇక కాంగ్రెస్ కు మిగిలిన మిజోరం ఈసారి చేయి త‌ప్ప‌నుంద‌న్న‌ది స‌ర్వేలంటుండ‌గా, తెలంగాణ‌లో కాంగ్రెస్-టీఆర్ఎస్ కు పోటాపోటీ ఉండ‌నుంది.

మిని సంగ్రామంలో… కాంగ్రెస్, బీజేపీల‌కు అత్యంత కీల‌క‌మైన‌వి. ఈ ఎన్నిక‌ల నుండే… లోక్ స‌భ ఎన్నిక‌ల ర‌ణ‌రంగం కూడా మోగుతుంది. ఇప్ప‌టినుండే ప్ర‌చార ప‌ర్వాలు, ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌ల‌వుతుంది. ఇంత‌టి కీల‌క ఎన్నిక‌లు ఏ పార్టీకి మేలు చేస్తాయో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*