శ‌బ‌రిలో క‌మ‌ళ‌నాథం… అందుకేనా ఈ అల్ల‌ర్లు

Read Time: 0 minutes

శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళా భ‌క్తుల ప్ర‌వేశంపై సుప్రీం తీర్పుపై… నిర‌స‌న‌లు, స‌మ‌ర్ద‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆచారాన్ని కాద‌ని, వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమల ఆలయ ప్రవేశం చేయవచ్చంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై బీజేపి అనుకూల సంస్థ‌లు తీవ్ర నిర‌స‌న తెలుపుతూ వ‌స్తున్నాయి. దీంతో… శ‌బ‌రిమ‌ళై ఆల‌య బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా, సుప్రీం ఇచ్చిన తీర్పుపై పున స‌మీక్ష‌ను కోర‌తూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించింది.

సుప్రీం తీర్పు త‌ర్వాత‌… తొలిసారిగా ఆల‌యం తెరిచారు. సుప్రీం కోర్టు తీర్పు ఉండ‌టంతో, అనేక మంది మ‌హిళ‌లు, కార్య‌క‌ర్త‌లు ఆల‌యానికి వెళ్లేందుకు ముందుకు రాగా, కొంత‌మంది గిరిజ‌నులు, సంఘ్ కార్య‌క‌ర్తలు దీనిపై నిర‌స‌న‌లకు దిగారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుప్రీం తీర్పుపై రివ్యూ కోరాల‌ని కేర‌ళ స‌ర్కార్ ను కోరినా, దానికి ప్ర‌భుత్వం నిరాక‌రించింది. అయితే, గ‌తంలో కాంగ్రెస్ కూట‌మి అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే… క‌రుడు క‌ట్టిన ఆరెస్సెస్ వాది సుప్రీంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించాల‌ని 2006లో పిటిష‌న్ వేశారు. ఇప్పుడ‌దే పిటిష‌న్ పై తీర్పు వ‌చ్చినా, అందుకు సంఘ్ రెడీగా లేదు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఇది రాజ‌కీయ ప్రేరేపిత చ‌ర్య‌లు అని స‌ర్కార్ వాదిస్తోంది. అయితే.. దీనిపై సుప్రీం మ‌ళ్లీ ఎమంటుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*