ఖైర‌తాబాద్ లో దానం వ‌ర్సెస్ దాసోజ్

Read Time: 0 minutes

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్. న‌గ‌రం న‌డిబొడ్డున ఉండ‌టం, కార్మిక‌ప‌క్ష నేత‌గా పేరొందిన మాజీమంత్రి పీజెఆర్ ప్రాతినిద్యం వ‌హించింది కూడా ఇక్క‌డి నుండే. అయితే మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో… పీజెఆర్ ఇలాకా కాంగ్రెస్ కంచుకోట‌గా మారింది.

గ‌తంలో కాంగ్రెస్ నుండి దానం నాగేంద‌ర్ గెలిచి మంత్రిగా ప‌నిచేసినా, 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యాడు. అక్క‌డ వైసీపీ అబ్య‌ర్థిగా బ‌రిలో దిగి… రెండోస్థానంతో కొద్దిలో ఓట‌మి పాల‌య్యింది పీజెఆర్ కూతురు విజ‌యా రెడ్డి. బీజేపి గెలుపొంద‌గా, దానం మూడో స్థానంకు ప‌రిమిత‌మ‌య్యాడు.

ప్ర‌స్తుతం విజ‌యారెడ్డి స‌హా దానం నాగేంద‌ర్ గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌రుపున పోటీచేసిన మ‌న్నె గోవ‌ర్ధ‌న్ రెడ్డి అంద‌రూ ఒకే పార్టీలో ఉన్నారు.  టీఆర్ఎస్ నుండి దానం కు టికెట్ క‌న్ఫామ్ కాగా, కాంగ్రెస్ నుండి దాసోజ్ శ్ర‌వ‌ణ్ బ‌రిలో ఉండ‌నున్నారు. అయితే, చివ‌రి వ‌ర‌కు టీఆర్ఎస్ టికెట్ కోసం విజ‌యారెడ్డి పోటీ ప‌డుతున్నా, దానం వైపే కేసీఆర్ మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్  నుండి దాసోజు ఇప్ప‌టికే ఖైరాతాబాద్ లో ప్ర‌చారం మొద‌లుపెట్టారు. దానంపై తెలంగాణ వ్య‌తిరేకి అన్న ముద్ర ఉంది. ఉద్య‌మంలో తెలంగాణ వాదుల‌పై దాడులు ఆయ‌న‌కు మైన‌స్ గా మారుతున్నాయి.

పైగా… నిన్న మొన్న‌టి వ‌ర‌క కాంగ్రెస్ లో ఉండి, ప‌ద‌వి కోస‌మే దానం పార్టీ మారారు అన్న అంశం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. దీంతో.. ఆయ‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త ఎవ‌రు క్యాష్ చేసుకుంటే వారికే విజ‌యం ద‌క్క‌టం త‌థ్యం. ఇక సిట్టింగ్ గా ఉన్న బీజేపి నేత చింత‌ల రాంచంద్రారెడ్డి కూడా ఈసారి గ‌ట్టిపోటీ ఇవ్వ‌నున్నారు. పెళ్లిళ్ల‌ల‌కు స్వం త ఖ‌ర్చుల‌తో… తాళిబొట్టు స‌హా కొత్త బ‌ట్ట‌లు ఇవ్వ‌టం, కేంద్ర ప్ర‌భుత్వ నిధులు రాబ‌ట్టంలో స‌ఫ‌లం కావ‌టంతో.. ఈసారి మోడీ వేవ్ క‌న్నా, త‌న సొంత పాపులారిటీతో పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. కానీ ప్ర‌దాన పోటీ మాత్రం… దానం వ‌ర్సెస్ దాసోజ్ అన్నట్లే సాగుతోంది. విద్యావంతుడు, వివాద ర‌హితుడు పైగా ఉద్య‌మంలో, టీఆరెస్ లో పనిచేసిన దాసోజ్ శ్ర‌వ‌ణ్ కు ఉన్న మంచి పేరు, కాంగ్రెస్ కంచుకోట కావ‌టం క‌లిసిరానుంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*