నిరుద్యోగులెవ‌రో తెలియ‌ద‌న్న కేసీఆర్, బృతి ప్ర‌క‌టించిన వేళా…

Read Time: 1 minutes

కాంగ్రెస్ ఇస్తున్న షాక్ ల‌కు కేసీఆర్… దిగిరాక త‌ప్ప‌టం లేదు. ఈ ఎన్నిక‌ల్లో అధికారం అప్ప‌గిస్తే… నిరుద్యోగ బృతి ఇస్తాం అని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ చెప్తే, అంతెత్తున ఎగిరిన కేసీఆర్… ఇవ్వాళ నిరుద్యోగ యువ‌త దెబ్బ త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన కేసీఆర్, నిరుద్యోగుల‌కు వ‌రం పేరుతో… అదే నిరుద్యోగ బృతిని ప్ర‌క‌టించారు. త‌లా తోక‌లేద‌ని, ఎవ‌రికి ఇస్తారు… నిరుద్యోగి కి ఎలా నిర్వ‌చ‌నం చెబుతావు అని ప్ర‌శ్నించిన కేసీఆర్ ఇప్పుడు 3016రూపాయాలు నెల‌,నెలా ఇస్తా అంటూ ప్ర‌క‌టించ‌టం పై నిరుద్యోగ యువ‌తీ యువ‌తులు ప్ర‌శ్నిస్తున్నారు.

తెలంగాణ వ‌చ్చి, ఓ ప్ర‌భుత్వం ముగిశాక కూడా… ఇంకా ఉద్యోగాలు ఎందుకు భ‌ర్తీ చేయ‌లేదు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌టానికే ఈ కొత్త జిమ్మిక్కు అంటూ మండిప‌డుతున్నారు. ఒ ప‌క్క అప్పుల‌పాల‌య్యాం, అంటు చెప్పే ఏపీ స‌ర్కార్ కూడా బృతి ఇస్తుంద‌ని, ఉద్యోగాలు క‌ల్పించ‌టంలో తెలంగాణ క‌న్నా ముందుంద‌ని… కానీ నియ‌మ‌కాల ట్యాగ్ లైన్ తో వ‌చ్చిన తెలంగాణ‌లో మాత్రం నియ‌మాకాలు లేవ‌ని, మోసం చేసార‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికైనా… ఎవ‌రైనా యువ‌తీ,యువ‌కులు కేసీఆర్ వైపు ఉంటే, ఆయ‌న జిమ్మిక్కులు తెలుసుకోవాల‌ని కోరుతున్నారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*