తెలంగాణ టీడీపీకి పెద్ద‌దిక్కుగా బాల‌య్య‌

Read Time: 0 minutes

ఎన్డీఆర్ న‌ట‌వార‌స‌త్వాన్ని పొందిన బాల‌య్య‌, రాజకీయ వార‌స‌త్వాన్ని అందుకోలేక‌పోయారన్న విమ‌ర్శ‌లున్న బాల‌కృష్ణ… ఆ ముద్ర చెరిపేసుకుంటారా అంటే, అందుకు ఓ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే క‌న‌పడుతోంది అంటున్నారు ఆయ‌న అభిమానులు. టీడీపీ నుండి హిందుపురం ఎమ్మెల్యేగా ఆంద్రాలో ఉన్న బాల‌య్య‌, తెలంగాణ‌లో రాబోతున్న ముంద‌స్తు ఎన్నిక‌లు… బాలయ్య‌కు పెద్ద బాద్య‌త‌నే అప్ప‌జెప్పాయి.

రాబోయే ఎన్నిక‌ల్లో బాల‌య్య‌… టీడీపీ కి పెద్ద‌దిక్కుగా మారారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ త‌రుపున ప్ర‌చారం చేయ‌డానికి పెద్ద నేత‌లు ఎవ‌రూ లేరు. కరిష్మా ఉన్న లీడ‌ర్లు ఎవ‌రూ లేరు. ఇటు చంద్ర‌బాబు గానీ, లోకేష్ గానీ వ‌చ్చి ప్ర‌చారం చేసే అవ‌కాశం లేదు. నేను ప్ర‌చారానికి వ‌స్తాన‌ని హ‌మీ ఇవ్వ‌లేను అని… చంద్ర‌బాబు ముందుగానే తెలంగాణ లీడ‌ర్లకు చెప్తూ వ‌చ్చారు. మీదే ఈ పార్టీ, మీరే నాయ‌కులు. మీరే ప్ర‌చారం చేసుకోవాల‌ని తేగేసి చెప్పారు.

దీంతో తెలంగాణ‌లో ఒటుబ్యాంకు ఉన్న టీడీపీని ఎవ‌రు ద‌రిచేర్చేది అంటూ… వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు బాల‌య్య రూపంలో స‌మాధానం దొరికింది. మొద‌ట్లో ఎన్టీయార్ వ‌స్తాడుకున్నా, ఇప్పుడు ఆ బాద్య‌త‌ను బాల‌య్య‌పై పెట్టారు చంద్ర‌బాబు. అందుకే ఆయ‌న ఇప్ప‌టికే ప్రచారం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే ఖ‌మ్మంలో ప్ర‌చారం చేసిన ఆయ‌న‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, గ్రేట‌ర్ లో కూడా మ‌రిన్ని స‌భల్లో ప్ర‌చారం చేయ‌బోతున్నార‌ని టీడీపీ వ‌ర్గాలంటున్నాయి. ఖ‌మ్మంలో ఉన్న రెస్పాన్స్ మిగ‌తా చోట్ల వ‌స్తే… టీడీపీకి ఖ‌చ్చితంగా లాభం చేకూర్చిన‌ట్లే అంటున్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఒక‌వేళ ఇక్క‌డ బాల‌య్య ప్ర‌చారం వ‌ర్క‌వుట్ అయితే, ఏపీ లోనూ ఆయ‌న‌కు మ‌రిన్ని బాద్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్నారు.

రాజకీయ వార‌స‌త్వాన్ని బాల‌య్య ఎంత‌మేర‌కు అందిపుచ్చుకుంటారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*