ఎందుకీ త‌మ‌న్, దేవీని పెడితే పోయేది

Read Time: 0 minutes

ఒక్కో జోడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ కాంబినేష‌న్ క‌లెక్ష‌న్ల పంట పండిస్తుంది. కానీ కొన్ని కాంబినేష‌న్లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. పేరుకు ఇద్ద‌రూ టాపే. ఆ ఇద్ద‌రు మొన‌గాళ్ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న తొలి చిత్రం అర‌వింద స‌మేత‌. క్రేజీ డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌త‌క‌ట్టిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా రెడీ అయిపోయింది. అతి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో …. సాంగ్స్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యాయి.

అయితే, ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ ప‌ర్స‌న్స్ చేస్తున్న సినిమాపై ఎంతో పెద్ద అంచానాలున్నా, ఈసినిమాకు ఆడియో పెద్ద మైన‌స్ అన్న టాక్ విన‌ప‌డుతోంది. సినిమా పాట‌లు ఒక్కోటిగా నెట్లో పెట్టిన‌ప్ప‌టికీ, పెద్ద‌గా ఎవ‌రికీ న‌చ్చ‌టం లేద‌న్న‌ది ఇప్పుడు టాలీవుడ్ టాక్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన‌… త‌మ‌న్, ఇప్ప‌టికే  టాలీవుడ్ ఇండ‌స్త్రీకి దూర‌మ‌య్యారు. ఒకే త‌ర‌హా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటల్లో వైవిధ్యం లేక‌పోవ‌టం త‌మ‌న్ కు పెద్ద మైన‌స్. అందుకే ఎంత త్వ‌ర‌గా ఇండ‌స్రీలో ఎదిగాడో, అంతే త్వ‌ర‌గా వెన‌క్కి వెళ్లిపోయాడు. ఇక త్రివిక్ర‌మ్ సినిమాల‌కు మ్యూజిక్ చేసే… అనిరుద్ ని కాద‌ని, ఈసారి త‌మ‌న్ కు అప్ప‌జెప్పినా, ఫ‌లితం పెద్ద‌గా క‌న‌ప‌డటం లేద‌న్న‌ది గ్రౌండ్ లెవ‌ల్ టాక్.

త‌మ‌న్ కు బ‌దులుగా, దేవీశ్రీ‌కి మ్యూజిక్ అప్ప‌గించి వుంటే, సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేదంటున్నారు ఎన్టీయార్ అభిమానులు. సినిమా మ్యూజిక్ తో ప‌నిలేకుండా…. డైలాగ్స్, స్ట్రిప్ట్ తో సినిమా ను హీట్ కొట్టించే త్రివిక్ర‌మ్ కు, సోలో ఇమేజ్ తో సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుపిరంచే ఎన్టీయార్ ఎంత‌వ‌ర‌కు అర‌వింత స‌మేత‌ను… ఎక్క‌డివ‌ర‌కు తీసుకెళ్తారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*