కాంగ్రెస్ కు పోటీగా టీఆరెఎస్ ఎన్నిక‌ల వ‌రాలు. రేపే విడుద‌ల‌.

Read Time: 0 minutes

తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో… ముందే చెప్పి కేసీఆర్ కు షాకిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్. అవే ప్ర‌చార అంశాలుగా కాంగ్రెస్ ప్రచారం నిర్వ‌హిస్తోంది. కానీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ మాత్రం, తామ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను మాత్రం విడుద‌ల చేయ‌లేదు.  దీంతో… మొద‌టికే మోసం వ‌చ్చేలా ఉంద‌ని గ్ర‌హించిన ఆపార్టీ… మంగ‌ళ‌వారం మ్యానిఫెస్టోను విడుద‌ల చేయ‌బోతున్నారు. దీనికి తాత్కాలిక మ్యానిఫెస్టో అని మాత్ర‌మే పేరు పెట్టారు. రాహుల్ గాంధీ, సోనియా ల సభ అనంత‌రం మ‌రిన్ని వ‌రాలు కురిపించాల‌న్న ఎత్తుగ‌డ ఉన్న‌ట్లు టీఆరెస్ స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ నేత కే.కేశ‌వ‌రావు నేతృత్వంలో మ్యానిఫెస్టో క‌మిటీ వేసిన కేసీఆర్…   మంగళవారం మద్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ లో భేటీ కాబోతున్నారు..  పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని మానిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పారు. ముఖ్యమైన సమావేశం అయినందున మానిఫెస్టో కమిటీ సభ్యులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని కేశవరావు కోరారు. ఇప్పటికే  అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చే హామీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. అందుకే పూర్తి మానిఫెస్టో సిద్ధమయ్యే లోగా, ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంగళవారం జరిగే మానిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించి, పాక్షిక మానిఫెస్టో ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ స్వయంగా పాక్షిక మానిఫెస్టోను ప్రకటిస్తారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*