టీఆర్ఎస్, బీజేపీ నేత‌ల‌పై న‌క్స‌ల్స్ గురి

Read Time: 0 minutes

మినీ ఎన్నిక‌ల స‌మ‌రం… మొద‌లైన నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌ల‌కు ఇంటలిజెన్స్, ఎన్.ఐ.ఏ ప్ర‌భుత్వానికి హెచ్చరిక‌లు చేసింది. ఇప్ప‌టికే ఏపీలో అర‌కు ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను హ‌త‌మార్చిన‌ట్లే… తెలంగాణ‌లో కూడా దాడుల‌కు దిగే అవ‌కాశం ఉంద‌ని… ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు స‌ర్కార్ ను అప్ర‌మ‌త్తం చేశాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలోని నాయ‌కులు కొంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు పోలీస్ బందోబ‌స్తు లేనిది, పోలీసుల‌కు స‌మాచారం లేనిది ప‌ర్య‌ట‌న‌లు చేయ‌రాద‌ని సూచించింది. గిరిజ‌న ప్రాంతాల్లో  సాయంత్రం, రాత్రి వేళ‌లో ప్ర‌చారాలు, ప‌ర్య‌ట‌న‌లు ఉంటే మానుకోవ‌టమే మంచిద‌ని సూచించింది.

కేవ‌లం తెలంగాణ‌లోనే కాదు, ఎన్నిక‌లు జ‌రుగుతున్న మ‌ద్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో మావోల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రఃలోని సుకుమా జిల్లాలో గ‌త రెండు నెల‌లుగా… ప్ర‌జాప్ర‌తినిధులే టార్గెట్ గా మావోయిస్టులు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని, ఏ క్ష‌ణంలోనైనా వారు దాడుల‌కు దిగ‌వ‌చ్చని ఎన్. ఐ.ఏ సూచించింది. మ‌ద్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్  ఘ‌డ్ రాష్ట్రాల్లో బీజేపీ నేత‌లే టార్గెట్ గా ఉన్నార‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చరిస్తున్నాయి.

కేంద్ర స‌మ‌చార‌, నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు తెలంగాణ పోలీస్ శాఖ అప్ర‌మ‌త్త‌మ‌యింది. పోలీస్ లంతా అల‌ర్ట్ గా ఉండాల‌ని తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేయ‌గా, మావోల వ్యూహాల‌కు పోలీసులు ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*