ఖ‌మ్మంలో తుమ్మ‌ల వ‌ర్సెస్ పొంగులేటి

Read Time: 0 minutes

ఖ‌మ్మం టీఆర్ఎస్ లో మంట‌లు ఆర‌టం లేదు. ఒక‌ప్ప‌టి గురుశిష్యులే నేడు బ‌ద్ద‌శ‌త్రువులుగా త‌యార‌య్యారు. ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, మంత్రి తుమ్మ‌ల మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌ల‌కు అధిష్టాన వ‌ర్గాలు స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా… ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌టం లేదు.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేత‌ల సీట్ల కేటాయింపు విష‌యంలో… తుమ్మ‌ల పంతం నెగ్గించుకోగా, పొంగులేటి అల‌క‌బూనారు. దాంతో ఆయ‌న కాంగ్రెస్ వైపు చూశారు. కానీ ఇంత‌లోనే ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌టం, పొంగులేటి కాస్త వెన‌క‌డుగు వేట‌యం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కేటీఆర్ పొంగులేటితో ప్ర‌త్యేక భేటీలు నిర్వ‌హించి… ప‌రిస్థితి కొంత అదుపులోకి తెచ్చారు. అందుకే ఈ మ‌ద్య కేటీఆర్ ఏ ప్రొగ్రాంకు వెళ్లినా అక్క‌డ కేటీఆర్ ప‌క్క‌నే పొంగులేటి ద‌ర్మ‌న‌మిస్తున్నారు. మ‌రోవైపు… ప్ర‌చారం విష‌యంలోనూ పొంగులేటి వ‌ర్గీయుల‌కు, తుమ్మ‌ల వ‌ర్గీయులకు అస్స‌లు ప‌డ‌టం లేద‌ని టాక్ విన‌ప‌డుతోంది.

టీడీపీ పార్టీ అభ్య‌ర్థిగా ఎంపీ బ‌రిలో ఉన్న నామా నాగేశ్వ‌ర్రావ్ ను ఓడించేందుకు 2014లో తుమ్మ‌ల బ్యాక్ గ్రౌండ్ లో త‌న‌వంతు స‌హ‌యం చేశారు. అది ఖ‌మ్మంలో చాలామందికి తెలుసు. కానీ త‌ర్వాత ప‌రిస్థితుల నేప‌థ్యంలో… పొంగులేటి, తుమ్మ‌ల ఒకే పార్టీలో చేరిపోయారు. పైగా వీరికి వైర్గ‌మే లేకుండా పోయింది. దీంతో ఇరువురు నేత‌లు త‌మే మాటే నెగ్గాల‌న్న  పంతానికి పోయి, పార్టీకి న‌ష్టం చేకూర్చుతున్నార‌న్న వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి. తాజాగా కొన్ని సీట్ల‌లో అభ్య‌ర్థుల్ని మార్చాల‌ని ఒక వ‌ర్గం, కొన‌సాగిచాల‌నే మ‌రో వ‌ర్గం పంతాల‌కు పోతుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో ఖ‌మ్మంలో… కేసీఆర్ ఎన్నిక‌ల టూర్ ఉన్న నేప‌థ్యంలో, కేసీఆర్ ఈ పంచాయితీకి ఎంత‌వ‌ర‌కు ముగింపు ప‌లుకుతారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*