ఉత్త‌మ్ మాట‌ల‌తో ఉలిక్కిప‌డుతున్న టీఆరెఎస్

Read Time: 1 minutes

వ‌ర్ధ‌మాన రాజ‌కీయాల్లో… కేసీఆర్ లాంటి నాయ‌కుల‌కు కూడా ఇరుకునపెట్టే నాయ‌కుడు లేని గ్యాప్ కొద్దికొద్దిగా తీరుతుంది. కేసీఆర్ ఎత్తుల‌కు ఎత్తులు వేస్తూ, ఇదిగో కేసీఆర్ ది త‌ప్పుడు హ‌మీలు, ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తూ… చేసే హ‌మీలు ఇవ్వటం ఉత్త‌మ్ కు బాగానే ఒంట‌బ‌ట్టింది. అసెంబ్లీ ర‌ద్దు జ‌ర‌గ్గానే… ఉత్త‌మ్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో కొన్ని అంశాలు ప్ర‌క‌టించారు. నిజానికి అది కేసీఆర్ అండ్ టీఆర్ఎస్  కు షాకే. వారు అంత త్వ‌ర‌గా ఎన్నిక‌ల హ‌మీలు ఇచ్చి, ప్ర‌జల్లోకి వెళ్తార‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు.

అది షాక్ కాబ‌ట్టే… కేసీఆర్ ఉత్త‌మ్ హ‌మీలు ప‌నికిరానివంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ అయితే ఎకంగా… సౌత్ ఇండియా బ‌డ్జేట్ కావాలంటూ ఎద్దేవా చేశారు. కానీ తీరా చూస్తే… కేసీఆర్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బాట‌లో వెళ్ల‌క‌త‌ప్ప‌లేదు. నిజానికి ఉత్త‌మ్ మ్యానిఫెస్టో ప్ర‌క‌టించ‌క‌ముందు కాంగ్రెస్ కు పెద్ద‌గా హైప్ రాలేదు. కానీ ఎన్నిక‌ల హ‌మీలు వ‌చ్చాక బాగానే జ‌నాల్లోకి వెళ్లాయి. అందుకే ముందు విమ‌ర్శించినా, కేసీఆర్ అండ్ టీమ్ దిగి రాక త‌ప్ప‌లేదు. ముఖ్యంగా నిరుద్యోగుల అంశంలో… కేసీఆర్ విధానాలు ఎలా మారాయో అర్థం చేసుకోవ‌చ్చు.

నాడు ఉత్త‌మ్ చెప్పిన అంశాలే… కొన్ని సంఖ్య‌ల మార్పులు-చేర్పులు చేస్తూ, కేసీఆర్ తాజాగా త‌మ పార్టీ మ్యానిఫెస్టో ప్ర‌క‌టించారు. కానీ అందులో ఉత్త‌మ్ చెప్పిన అంశాలే… ఎక్కువ‌గా ఉన్నాయి. దీన్ని చూసి… కాంగ్రెస్ మ్యానిఫెస్టో చ‌దివారా కేసీఆర్ మ‌ర్చిపోయి అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

సో… కాంగ్రెస్ గెయిన్ అవుతుంది, ఉత్త‌మ్ వ్యూహాలు ఫ‌లిస్తున్నాయి అన‌టానికి ఇవే స‌రైన ఉదాహ‌ర‌ణ‌లు. నువ్వా-నేనా అన్న‌ట్లు ఇద్ద‌రు అద్య‌క్షులు త‌ల‌ప‌డ‌తున్న నేప‌థ్యంలో… ఎవ‌రు పై చేయి సాధిస్తారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*