అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌నల అనంతంరం కాంగ్రెస్ మ‌రో జాబితా విడుద‌ల‌.

Read Time: 1 minutes

ఓ వైపు నామినేష‌న్ల ముగింపు గ‌డువు ముంచుకొస్తుండ‌టం, టికెట్ల ఆశావాహుల ఒత్తిళ్లు ఎక్కువ‌వుతండ‌టంతో… కాంగ్రెస్ మ‌రో జాబితాను విడుద‌ల  చేసింది. ఇప్పటి వ‌ర‌కు 88 మంది జాబితాను విడుద‌ల చేసిన కాంగ్రెస్ పార్టీ, మ‌రో 8 సీట్ల జాబితాను విడుద‌ల చేసే అవకాశం క‌న‌ప‌డుతోంది.

అయితే, ఈ జాబితాలో… చివ‌రి వ‌ర‌కు అనేక ఉత్కంఠ న‌డిచింది. ఈ జాబితాలో చోటు ద‌క్కిన వారితో పాటు, పోటీలో ఉన్న అబ్య‌ర్థుల‌తో… రాహుల్ గాంధీ నేరుగా స‌మావేశ‌మ‌య్యారు. ఇద్ద‌రు బ‌లాబ‌లాలు.. గ‌తంలో పార్టీలో ఉన్న‌నాటి  సంగ‌తులు, తెలంగాణ ఉద్య‌మంలో పాత్ర‌పై ఇంట‌ర్వ్యూ త‌ర‌హలో ప్ర‌శ్న‌లు సందించిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాతే… తుది జాబితాకు ఆమోదముద్ర వేశారు. ఇక చివ‌రి క్ష‌ణం వ‌రకు ఉత్కంఠ రేపిన‌… జ‌న‌గాం సీటును ఎట్ట‌కేల‌కు కోదండరాం వ‌దులుకోగా, పొన్నాల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. తాజాజాబితాలో…

1. ఇల్లందు– హ‌రిప్రియ నాయ‌క్

2. బోథ్‌–సోయం బాపురావ్

3. నిజామాబాద్ అర్భ‌న్– తాహెర్ బిన్ అమ్మ‌ద్

4. నిజామాబాద్ రూర‌ల్– భూప‌తి రెడ్డి, (టీఆరెఎస్ నుండి ఎమ్మెల్సీ, ఇటీవ‌లే పార్టీలో చేరారు)

5. ఎల్. బి న‌గ‌ర్– సుధీర్ రెడ్డి

6. కార్వాన్– ఓస్మాన్ బిన్ మ‌హ్మ‌ద్ హ‌జ్రీ

7. యాక‌త్ పుర‌– రాజేంద‌ర్ రాజు

8. బ‌హ‌దూర్ పురా– కాలేం రాజు

9. కొల్లాపూర్– హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి

10. దేవ‌ర‌కొండ‌– బాలూ నాయ‌క్

12. తుంగ‌తుర్తి– అద్దంకి ద‌యాక‌ర్

13. జ‌నగాం– పొన్నాల ల‌క్ష్మ‌య్య‌.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*