అప్ప‌టిదాకా… కేటీఆరే.

Read Time: 1 minutes

50 రోజుల్లో 100 స‌భ‌ల నినాదాన్ని ప‌క్క‌న‌పెట్టేసిన గులాబీ బాస్… ఇప్పుడు బ‌య‌ట క‌న‌ప‌డ‌ట‌మే మానేశాడు. అన్నీ తానే అయి… గెలిపించుకుంటా అంటూ అబ్య‌ర్థుల‌కు దైర్యం చెప్పినా… పెద్ద‌య‌నా రాక‌పోవ‌టంతో, క్యాడ‌ర్ సంగ‌తి అంటుంచితే… అబ్య‌ర్థులు కూడా డీలా అయిపోతున్నారు.

యుద్దం చేయాలంటే…. క‌నీసం ప్రత్య‌ర్థి ఎవ‌రో తెలియాలి క‌దా… కానీ ఈ లాజిక్ ను కేసీఆర్ ఎలా మిస్స‌య్యాడు… అన్న‌ది అస‌లు ప్ర‌శ్న అయితే, ఆ ప్ర‌శ్న లేటుగా తెలియ‌టంతో… కేసీఆర్ మొఖం చేటేశాడు. కానీ సైనికులుగా… పెద్దాయ‌న పిలుపుతో బ‌రిలోకి దిగిన వారు వెన‌క్కి రాలేరుగా… అందుకే వారికి కొంత‌లో కొంతైనా మేలు చేయాల‌నుకున్న‌ట్లున్నాడు కేటీఆర్. నేనున్నా అంటూ…. జిల్లాల‌ను తిరేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న సొంత సీటును చ‌క్క‌పెట్టుకుంటూనే… క‌ల్వ‌కుర్తి, అచ్చంపేట‌, మ‌క్త‌ల్, మ‌మ‌బూబాబాద్… ఇలా నియోజ‌క‌వ‌ర్గాల్లోకి వెళ్తున్నారు.

అయితే… కేసీఆర్, హ‌రీష్ ల‌తో వ‌చ్చేంత మైలేజ్ రావ‌టం లేద‌న్న‌ది లోకల్ టాక్. కానీ, కాబోయే సీఎం అని ప్ర‌చారం జ‌రుగుత‌న్న సంద‌ర్భంలో….  ఖ‌ర్చు పెట్ట‌కుండా ఉండ‌లేరు క‌దా, సో… మంచో చెడో, ఓ ఊపైన వ‌స్తుంది అనుకున్న‌ట్లున్నారు టీఆర్ఎస్ అబ్య‌ర్థులు. కేటీఆర్ తో స‌భ‌లు పెట్టిస్తున్నారు. కేటీఆర్ కూడా… కేసీఆర్ మేల్కొనే లోపే వీలైన‌న్ని ఎక్క‌వ స‌భ‌లు క‌వ‌ర్ చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమితం, గ్రామీణ ప్ర‌జానీకానికి చేరువ‌కాలేక‌పోయారు కేటీఆర్ అన్న ముద్ర చేరుపేసుకునే ప‌నిలో ఉన్న‌ట్లు ఉన్నారు అనుకుంటున్నారు టీఆర్ఎస్ లోని ఓ వ‌ర్గం నేతలు.

మ‌రీ.. కేసీఆర్ ఎప్ప‌టి నుండి బ‌య‌ట‌కు వ‌స్తారో… లేక వ‌స్తున్న స‌ర్వే రిపోర్టుల‌ను దృష్టిలో పెట్టుకొని, కేటీఆర్– హ‌రీష్ ల‌కే
భాద్య‌త ఇచ్చి ప‌నికానిచ్చేస్తారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*