అలా అయితే… గెలిచినా, మ‌ళ్లీ రాజీనామా చేస్తా– ఉత్త‌మ్ స‌వాల్.

Read Time: 1 minutes

తెలంగాణ రాజ‌కీయాలు స‌వాళ్లు– ప్ర‌తి స‌వాళ్ల‌తో వేడేక్కుతున్నాయి. టీఆర్ఎస్ నుండి కేటీఆర్, హ‌రీష్‌, కేసీఆర్లు స‌వాల్ విసురుతుంటే… కాంగ్రెస్ నేత‌లు ప్ర‌తి స‌వాళ్ల‌తో ముందుంటున్నారు. దీంతో… ప్ర‌చారం మ‌రింత వేడేక్కుతుండ‌గా, తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ రెడ్డి చేసిన స‌వాల్ మ‌రింత వేడి రాజేసింది.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నుండి ఎన్నారై సైదిరెడ్డి బ‌రిలో ఉన్నారు. సైదిరెడ్డి జ‌గ‌దీష్ రెడ్డికి అత్యంత ద‌గ్గ‌రి వ్య‌క్తి. అందుకే ఆయ‌న‌కు టికెట్ ద‌క్కింద‌ని చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఆ మ‌ద్య సూర్యాపేట క‌లెక్ట‌ర్ నిర్మాణం, భూమి కొనుగోలు అంశంలో సైదిరెడ్డిపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ అంశాన్ని ప‌క్క‌న‌పెడితే… ఉత్త‌మ్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి మ‌రో స‌వాల్ విసిరారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు ఖ‌చ్చితంగా 50వేల మెజార్టీ ప‌క్కా అని, అలా రాక‌పోతే… తాను గెలిచినా, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ ప్ర‌క‌టించారు. నేను అభివృద్దిని హుజుర్ న‌గ‌ర్ కు ప‌రిచ‌యం చేస్తే, మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి త‌న అనుచ‌రుల‌… అవినీతి, కుంభ‌కోణల‌తో  మా ప్రాంతం ప‌రువును దిగ‌జార్చార‌ని మండిప‌డ్డారు. నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకొని గెలవాల‌ని ఆశ‌ప‌డ్డార‌ని, కానీ ప్ర‌జ‌లు ఎటువైపు ఉన్నారో త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని టీఆర్ఎస్ పై మండిప‌డ్డారు. అందుకే… అప్పుడు వెళ్లిన నేత‌లంతా, ఇప్పుడు తిరిగి సొంత‌గూటికి వ‌స్తున్నార‌ని, హుజుర్ న‌గ‌ర్ టూరిజం ను నాగార్జున సాగ‌ర్ టూరిజంతో స‌మానంగా అభివృద్ది చేశాన‌ని… రాబోయే రోజుల్లో హుజుర్ న‌గ‌ర్…  మ‌రింత అభివృద్ది చెంద‌బోతుంద‌ని జోస్యం చెప్పారు.

అయితే, ఉత్త‌మ్ ను ఓడించేందుకు… టీఆర్ఎస్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కానీ, ఆ పార్టీ అబ్య‌ర్థిపై పౌర‌స‌త్వం కేసు బ‌య‌ట‌కు రావ‌టంతో… ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అంత‌ర్మ‌థ‌నంలో ఉంద‌ని తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*