ఆ ఎఫైర్ నిజ‌మే… కుర్ర‌హీరోతో హాట్ బ్యూటీ.

Read Time: 1 minutes

బాలీవుడ్ లో కాస్త ఓల్డ్ అయినా… హాట్ హాట్ గా త‌న అందాల‌తో ఇప్ప‌టీకీ పిచ్చేక్కించే బ్యూటీ మ‌లైకా అరోరా. పెండ్ల‌యి, ఓ బిడ్డ కూడా ఉన్నా, ఈ మ‌ద్య ఓ కుర్ర‌హీరోతో ఎఫైర్ ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. ఆ ఎఫైర్ బ‌య‌ట‌కు పొక్క‌టంతో.. మ‌లైక భ‌ర్త విడాకులిచ్చిన విష‌యం తెలిసిందే.

మ‌లైక త‌న పెళ్లి త‌ర్వాత కూడా ఎఫైర్  కొన‌సాగించింది. దాంతో… విసిగి వేసారి, విడాకులు తీసుకున్నాడు భ‌ర్త, బాలీవుడ్ న‌టుడు అర్భాజ్ ఖాన్. ఇక ఆ త‌ర్వాత కూడా కుర్ర హీరో అర్జున్ క‌పూర్ తో మ‌లైకా ప్రేమాయ‌ణం కొనసాగిస్తోంది. ఎలాగు విడాకులు వ‌చ్చేశాయ్ కాబ‌ట్టి అర్జున్ క‌పూర్ ను త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌నలో ఉంద‌ట మ‌లైకా. ఈ మ‌ద్య వీరిద్ద‌రూ క‌లిసి తిరుగుతూ, విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నా వీడియోలు, ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో… ఇన్నాళ్లు గాసిప్ గా ఉన్న ఈ ప్రేమాయ‌ణం అధికారిక‌మ‌ని తెలిపోయింది. అంతేకాదు… అంద‌రు బాలీవుడ్ ఫేమ‌స్ జంట‌లు నివాస‌ముండే ముంబాయిలోని ఓ ఖ‌రీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కూడా తీసుకున్నార‌ట  ఈ జంట‌.
Malaika Arora3 Malaika Arora2 Malaika Arora

అంతేకాదు… ఎలాగు బ‌య‌ట‌కు తెలిసింది కదా అనుకున్నారో లేక‌, ఎప్ప‌టికైనా తెల‌వాల్సిందే క‌దా అనుకుందో ఏమో…. మ‌లైకా–అర్జున్ క‌పూర్ ల బంధాన్ని త‌న లాకెట్ ద్వారా చేప్పేసింది మ‌లైకా. త‌న మెడ‌లో ఓ లాకేట్ వేసుకొని, దాన్నిసోషల్ నెట‌వ‌ర్క్ లో షేర్ చేసింది. ఆ లాకెట్ లో ఎ-ఎం అని ఉంది. అంటే అర్జున్ -మ‌లైకా అని అర్థం అన్న‌మాట‌. అయితే… అర్జున్ క‌న్నా మ‌లైకా ఎంతో పెద్ద‌ది. దాదాపు ప‌దేళ్ల పెద్ద‌దైన మ‌లైకా… కుర్ర‌హీరో వెంట ప‌డ్డ‌ది అని కామెంట్స్ చేస్తున్న వారూ ఉన్నారు.

ప్రేమ వివాహాలు జ‌రుగుతున్న బాలీవుడ్ లో… ఇక నెక్ట్స్ వీరి పెండ్లేన‌ని కోడై కూస్తోంది బాలీవుడ్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*