ఆ ఒక్క ప‌నికి… అంత రేటా…? రేట్లు పెంచేసిన సౌత్ హీరోయిన్స్.

Read Time: 1 minutes

సినిమాల షూటింగ్ లంటే… ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్థః చేసుకోవ‌చ్చు. డేట్లు అడ్జ‌స్ట్ మెంట్, పోస్ట్ పోన్స్…. నానా ఇబ్బందులు ఉంటాయి. సినిమా మొత్ం చేస్తే… టాప్ హీరోయిన్ అయితే,  ఒక‌ట్రెండు కోట్లు ఉంటుంది. కానీ అంతే డబ్బు, కొన్నిసార్లు అంత‌క‌న్నా ఎక్కువ మొత్త‌మే… ఒక‌టి రెండు రోజుల్లో వ‌చ్చేస్తే ఎవ‌రు మాత్రం కాదంటారు. అందుకే మ‌న సౌత్ గ్లామ‌ర్ హీరోయిన్స్ ఆ ప‌నికి ఒప్పేసుకుంటున్నారు.

సౌత్ ఇండియా ఇండస్ట్రీలో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకునే భామ నాయ‌న‌తార‌. అందానికి అందం, గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ఎమాత్రం వెన‌కంజవేయ‌ని నైజం ఆమెది. పైగా ఆప్ క‌మింగ్ హీరోల‌కు, సీనీయ‌ర్ ల ప‌క్క‌న హీజీగా ఆడాప్ట్ అయిపోతుంది. అందుకే.. ఆమె ఒక్కో సినిమాకు క‌నీసం మూడు నుండి ఐదు కోట్ల‌కు త‌క్కువ కాకుండా తీసుకుంటుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి, ఎక్కువ రోజులే అయినా… న‌య‌న్ రేటు ఏమాత్రం ప‌డిపోలేదు.

ఇక టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న గ్లామ‌ర్ బ్యూటీ సమంత‌. ఆమె కూడా అంతే… రెమ్యూన‌రేష‌న్ లో గ‌ట్టిగానే తీసుకుంటుంది. కానీ… వీరంతా… ఇప్పుడు ఒక‌ట్రెండు రోజుల్లో పూర్త‌య్యే యాడ్స్ కు ఎక్కువ‌గా ఓకే చెప్పేస్తున్నారు. ప‌ని సింపుల్… మ‌ణీ ఫుల్. దీంతో… న‌య‌న్, స‌మంతాలు యాడ్స్ కు ఎక్కువ‌గా అంగీక‌రిస్తుండ‌గా…. వీరికోసం ఆయా సంస్థ‌లు కూడా 2 నుండి 3 కోట్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడ‌టం లేద‌ట‌. పైగా… పెద్ద‌గా రిస్క్ ఉండ‌దు, డేట్స్ బెంగ అస‌లే ఉండ‌దు.  ఇక వీరి త‌ర్వాత‌… కాస్త ఓల్డ‌యిపోయి, ఈ మ‌ద్య వెనుక‌బ‌డిపోయిన త‌మన్నా, కాజ‌ల్ కు కూడా బాగానే యాడ్స్ వ‌చ్చిప‌డుతున్నా, స‌మంతా–న‌య‌న్ ల‌తో మాత్రం పోటీప‌డ‌లేక‌పోతున్నారంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాలన్న ఆలోచ‌న సినితార‌ల‌కు తెలిసినంతగా మ‌రెవ‌రికి తెలియ‌దేమో… అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే, ప‌ని పూర్తిచేసుకొని నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*