ఆ విష‌యంలో… ఎందుకు కాంగ్రెస్ నేత‌లు వెన‌క‌ప‌డ్డారు…?

Read Time: 0 minutes

అస‌లే ఎన్నిక‌ల స‌మ‌యం. కేసీఆర్ పై  పోటీచేస్తోన్న ఓంట‌రే న‌న్ను చంపేస్తారు… ఇక నా ప‌ని అయిపోయిందంటూ ఏడ్చేశారు. ఇండ్ల మీద కొచ్చి… అర్ధ‌రాత్రి సోదాలంటూ భ‌య‌పెడుతున్నారు… ఒక్క‌రు కూడా మాట్లాడ‌లేదు. అస‌లు కాంగ్రెస్ లో ఏం జ‌రుగుతోంది…?

నిజానికి… సీఎంపై పోటీ చేసే వ్య‌క్తికి అండ‌గా పార్టీ ఉంటుంది. సీనీయ‌ర్ నేత‌లంతా… మేమున్నాం అంటూ తోడుగా ఉంటారు. ఆర్థిక వ్య‌వ‌హ‌రాలూ చూసుకుంటారు. అందులోనూ కేసీఆర్ కు ముచ్చేమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ఓంటేరు ప్ర‌తాప్ రెడ్డి లాంటి నేత‌కు మ‌రింత అండ‌గా ఉండాల్సిన సీనీయ‌ర్లు క‌నీసం… ప‌ట్టించుకోవ‌టం లేదు. ఎవ‌రికి వారు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు కోసం దృష్టిపెట్టారు త‌ప్పా, బ‌య‌టి ప్ర‌పంచాన్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ మీడియా ముందు ఖండించారు గానీ, ఆయ‌న త‌ప్పా…ఇంకెవ‌రూ క‌నీసం మాట కూడా మాట్లాడ‌టం లేదు. దీంతో… ఎంటీ ఈ విచిత్ర‌మ‌ని ఆరా తీస్తున్నారు ఇత‌ర పార్టీల నేత‌లు.

అయితే, ఇది పొలిటిక‌ల్ గేమ్ అని… కేసీఆర్ కాంగ్రెస్ పెద్ద నేత‌ల‌ను గ‌జ్వేల్ ర‌ప్పించి, అక్క‌డ శాంతిబ‌ద్ర‌త‌ల స‌మస్య ఉంద‌ని చెప్పి… అరెస్ట్ చేయించే ఎత్తుగ‌డ కూడా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే నేత‌లు కామ్ గా ఉన్నార‌న్న చ‌ర్చ ఉన్నా, క‌నీసం మీడియా ముందుకు కూడా రావ‌టానికి ఏమైంద‌న్న అంశం కూడా తెర‌పైకి వ‌స్తోంది. అయితే… ఈ దాడులతో ఓంటేరుకు, కాంగ్రెస్ కు మంచే జ‌రుగుతుంద‌ని… ఆయ‌న్ను ఇబ్బందిపెట్ట‌డం ద్వారా సానుభూతి ఓట్లు వ‌స్తాయ‌ని అంటున్నారు  కొంద‌రు నేతలు. కేసీఆర్ ఎంత ఇబ్బంది పెడ్తే… అంత‌కు కాస్త ఎక్కువే ఓంటేరు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని, ఇది చివ‌ర‌కు కేసీఆర్ కు బ్యాక్ ఫైర్ అయినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని, సానుభూతి విష‌యంలో ఓంటేరు విజ‌యం సాధిస్తున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు పోలిటిక‌ల్ ఎక్స‌ప‌ర్ట్స్.

కానీ, క‌నీసం మెద‌క్ జిల్లా నాయ‌క‌త్వం అయినా, ఒంటేరు కు అండ‌గా ఉండాల‌న్న వాద‌న అయితే… గ‌ట్టిగానే విన‌ప‌డుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*